Devara: దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్ షోలకు ప్లాన్, టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
Devara Benfit Shows: దేవర మూవీ రిలీజ్‌కు ఇంకా పది రోజులే ఉంది. రిలీజ్‌కు ముందే ప్రీ సేల్‌లో దుమ్మురేపుతుంది. దీంతో ఆ ఏరియాలో మూవీ మిడ్‌నైట్ బెనిఫిట్ షోలకు థియేటర్లు భారీ ప్లాన్ చేస్తున్నాయట.
మరో పది రోజుల్లో 'దేవర' మూవీ థియేటర్లో సందడి చేయబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం 'దేవర'. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో నెల రోజుల ముందు నుంచి 'దేవర' సందడి మొదలైంది. ఇక ప్రీ సేల్‌లో ఈ చిత్రం దుమ్మురేపుతుంది. ఓవర్సిస్ ప్రీ బుక్కింగ్స్‌లో టికెట్స్ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నెల రోజుల ముందే నార్త్ అమెరికాలో టికెట్స్ ఒపెన్ అవ్వగా ఇప్పటి వరకు సుమారు 5 లక్షలకుపైగా టికెట్స్ అమ్ముడైనట్టు తెలుస్తోంది. కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్‌లో మిలియన్ డాలర్ల బిజినెస్ దాటేసింది. ఇంకా సినిమాకు పది రోజులు ఉంది.
మిడ్‌నైట్ బెన్‌ఫిట్ షోలు
ఇప్పటి వరకు దేవర ప్రే సేల్‌లో 1.7 మిలియన్ల డాలర్ల బిజినెస్ చేసినట్టు అక్కడ థియేటర్లు వెల్లడించాయి. ఇండియాలోనూ దేవర బిజినెస్ భారీగానే జరుగుతుంది. ఇప్పటికే హిందీలో ఈ చిత్రాన్ని ధర్మప్రొడక్షన్ భారీగా రిలీజ్ చేస్తుంది. ఇక తెలుగులోనూ దేవర థియేట్రికల్ బిజినెస్ జోరుగా జరుగుతుంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో దేవర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాంలో ఈ చిత్రానికి భారీ బిజినెస్ జరుగుతుంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు నైజాం థియేటర్లో ఓ భారీ ప్లాన్ చేస్తున్నాయి. మూవీ రిలీజ్‌కు ముందుకు రోజు మిడ్ నైట్ బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా టికెట్ల ధరలను రూ. 1000 నుంచి రూ. 5000 వరకు అమ్మాలని థియేటర్ యాజమాన్యాలు ప్లాన్ చేస్తున్నాయట. అలా రిలీజ్‌కు ముందుకు రికార్డులు నెలకొల్పుతుంది దేవర మూవీ.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనికి ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎందుకంటే తారక్ థియేటర్లోకి సోలోగా వచ్చి దాదాపు ఆరేళ్లు అవుతుంది. 'అరవింద సమేత వీర రాఘవ' తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్న చిత్రమిది. దీంతో చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ సోలోగా థియేటర్లోకు వస్తున్నాడు. సో ఆయన సినిమా బెనిఫిట్ షోలకు ఆ మాత్రం టికెట్ రేట్లు పెంచడం సమ్మతమే అంటున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే రిలీజ్ డేట్‌వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం దేవర ఒపెనింగ్ డే భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఖాయం అవుతుంది. అనుకున్నట్టు టికెట్స్ రేట్స్ ఆ రేంజ్‌లో ఉంటే మాత్రం దేవర ఒపెనింగ్ వసూళ్లలలో పఠాన్, కల్కి, కేజీయఫ్ వంటి చిత్రాలు రికార్డులను తుడిపెడుతుందడనంలో సందేహం లేదు.
రెండు పార్టులుగా దేవర
కొస్తా తీర ప్రాంతాల బ్యాక్‌డ్రాప్‌లో భారీ యాక్షన్ మూవీ దేవరను తెరకెక్కించాడు కొరటాల. ఇక ఈ చిత్రాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందకు తీసుకువస్తున్నారు. తొలిపార్ట్ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్,పాటలు, టీజర్, ట్రైలర్‌లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ అండర్ వాటర్‌లో చేసిన యాక్షన్ సీన్‌కి ఆడియన్స్ నుంచి వీపరితమైన స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో మొత్తం ఈ సీన్ గురించే చర్చ జరుగుతుంది. ఇక థియేటర్లో ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించడం పక్కా. అని ఈళలతో థియేటర్లు మారుమోగం ఖాయం అంటున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రతికథానాయకుడిగా నటిస్తున్నాడు. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Also Read: నయనతార హిట్ మూవీ సీక్వెల్‌కు డైరెక్టర్‌ని మార్చిన మేకర్స్ - కొత్త పోస్టర్స్‌తో సర్‌ప్రైజ్!