అన్వేషించండి

Devara Collection Worldwide: దేవర @ 500 కోట్లు - ఇదీ ఎన్టీఆర్ మాస్, మిక్స్డ్ టాక్‌తో ఈ రికార్డ్స్‌ అంటే దేవుడు సామి

Devara Box Office Collection: ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ చేరుకుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర'. మొదటి రోజు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్‌ వచ్చినా సరే... ఈ సినిమా ఎక్కడా ఆగలేదు. దూకుడు చూపించింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses) స్టార్ పవర్ ఎంత? అంటే సోషల్ మీడియా ట్రోల్స్, మిక్స్డ్ టాక్‌ వంటివి తట్టుకుని మరీ సినిమాను లాభాల్లోకి తీసుకు వచ్చేంత! అందుకు రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్... 'దేవర: పార్ట్ 1' (Devara Part 1).

రూ. 500 కోట్ల క్లబ్బులో ఎన్టీఆర్ 'దేవర'
Devara Part 1 enters into Rs 500 Crore club: ప్రపంచ వ్యాప్తంగా 'దేవర పార్ట్ వన్' కలెక్షన్లు 500 కోట్ల గ్రాస్ మార్కును దాటాయి. ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులను సంతోషపెట్టేది. ఈ సినిమా విడుదలకు ముందు ఉన్న అంచనాలతో పోలిస్తే అంత కలెక్ట్ చేసిందని ఊహించారు.‌ 

ఎన్టీఆర్ స్టార్ పవర్, జాతీయ అంతర్జాతీయ ప్రేక్షకులలో ఆయనకు ఉన్న ఇమేజ్ వంటివి పరిగణలోకి తీసుకుంటే 500 కోట్ల రూపాయల వసూళ్లు రావడం సహజమే. అయితే, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి... సినిమా విడుదలైన రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలతో పాటు కొంత మంది ప్రేక్షకులు కూడా ఊహించలేదు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Devara Movie (@devaramovie)

'దేవర' విడుదలైన రోజు మిక్స్డ్ టాక్ లభించింది. సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ ఫాన్స్ విపరీతమైన ట్రోలింగ్ చేయించారు. అయినా సరే ఈ సినిమా తట్టుకుని నిలబడింది. విజయ దశమి వరకు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైంది. ఇంకా 'దేవర'ను చూడాలని థియేటర్లకు వస్తున్న జనాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీని వెనుక ఉన్న ఒకే ఒక్క పేరు ఎన్టీఆర్. ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నది ఆయన చరిష్మా, స్టార్ స్టేటస్.

Also Read: అప్డేట్స్ జాతర @ టాలీవుడ్ - దసరాకు ఎవరెవరు ఏయే కొత్త విషయాలు చెప్పారో తెలుసా?


పంపిణీదారులకు భరోసా ఇచ్చిన ఎన్టీఆర్!
'బాహుబలి 2', 'ట్రిపుల్ ఆర్', 'కేజిఎఫ్ 2', 'కల్కి 2898 ఏడీ' వంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి అంటే... కారణాలు వేరు. పార్ట్ వన్ సక్సెస్ కావడంతో పార్ట్ 2 మీద అంచనాలు పెరగడం భారీ ఓపెనింగ్ సాధించడం సహజం. రాజమౌళి బ్రాండ్ వాల్యూ మీద 'ట్రిపుల్ ఆర్' ఆడిందని చెప్పే జనాలు ఉన్నారు. 'దేవర'కు వస్తే పూర్తిగా ఇది ఎన్టీఆర్ ఇమేజ్ మీద ఆడిన సినిమా. దీనికి ముందు కొరటాల శివ దర్శకత్వం వహించిన 'ఆచార్య' ఆశించిన రీతిలో ఆడలేదు. వసూళ్లు సైతం రాలేదు. 'దేవర' విడుదల తర్వాత 100% హిట్ టాక్ కూడా లేదు.‌ అయినా ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయి. దాంతో పంపిణీదారులకు ఎన్టీఆర్ అంటే భరోసా ఏర్పడింది. ఇక నుంచి దర్శకుడు తీసిన గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ పేరు కనపడితే కోట్ల రూపాయలు పెట్టి రైట్స్ కొనే భరోసా కలిగింది. దేవర తర్వాత వార్ డ్రాగన్ సినిమాలతో ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరగడం ఖాయం. దేవర 2 విడుదల సమయానికి ఓపెనింగ్స్ రికార్డులు బద్దలు కావడం కూడా ఖాయమని చెప్పాలి.

Also Readమర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఖాన్ ఎందుకు వెళ్లారు? ఆస్పత్రికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు? ఎవరీ బాబా సిద్ధిఖీ??

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Rohit Engagement: చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
Best 5G Smartphones Under 25000: రూ.25 వేలలో మంచి కెమెరా ఉన్న బెస్ట్ 5జీ ఫోన్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?
రూ.25 వేలలో మంచి కెమెరా ఉన్న బెస్ట్ 5జీ ఫోన్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?
Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Baba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samsonవిజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Rohit Engagement: చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి
Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు
Best 5G Smartphones Under 25000: రూ.25 వేలలో మంచి కెమెరా ఉన్న బెస్ట్ 5జీ ఫోన్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?
రూ.25 వేలలో మంచి కెమెరా ఉన్న బెస్ట్ 5జీ ఫోన్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?
Tadipatri News: 15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
15 శాతం కమిషన్‌ ఇవ్వాల్సిందే - తాడిపత్రిలో వ్యాపారస్తులకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక!
Oviya Video Leaked Online: తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 
తమిళ నటి ప్రైవేట్ వీడియో లీక్! ఎంజాయ్ చేయండంటూ షాకిచ్చిన ఓవియా 
UP: చెత్తకుండీలో పసిబిడ్డ - దత్తత తీసుకున్న ఎస్సై దంపతులు, పండుగ వేళ దుర్గమ్మ ఇంటికి వచ్చిందని సంబరం
చెత్తకుండీలో పసిబిడ్డ - దత్తత తీసుకున్న ఎస్సై దంపతులు, పండుగ వేళ దుర్గమ్మ ఇంటికి వచ్చిందని సంబరం
Telangana Crop Loan Waiver: రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
Crime News: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన - పోలీసుల దర్యాప్తు ముమ్మరం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన - పోలీసుల దర్యాప్తు ముమ్మరం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Embed widget