Aishwarya Rai: కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యకు తోడుగా ఆరాధ్య - గాయపడిన తల్లికి కూతురు సాయం
Aishwarya Rai: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నడవడం ఐశ్వర్య రాయ్‌కు కామన్ అయిపోయింది. కానీ ఈసారి తన చేతికి గాయం అవ్వడంతో కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడవడానికి తన కూతురు సాయం చేసింది.
Aishwarya Rai Bachchan At Cannes: 2002 నుంచి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రెగ్యులర్‌గా అటెండ్ అవుతున్న ఇండియన్ సెలబ్రిటీల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఒకరు. అందుకే 2024లో కేన్స్ ఫెస్టివల్‌ను మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో చేతికి గాయమైనా కూడా.. కట్టుతోనే రెడ్ కార్పెట్‌పై నడిచింది ఈ మాజీ విశ్వసుందరి. చేతికి కట్టు ఉన్నా కూడా ఐశ్వర్య కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఆ కట్టుతో, అంత పెద్ద గౌన్‌తో రెడ్ కార్పెట్‌పై నడుస్తూ మెట్లు దిగడానికి కాస్త ఇబ్బంది పడింది ఐశ్వర్య రాయ్. దీంతో తన కూతురు ఆరాధ్య తనకు సాయం చేయడానికి ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
చేతికి గాయం..
మే 16న జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ నడిచింది. అయితే అందులో ఐశ్వర్య ధరించిన గౌన్ ఎంత వైరల్ అవుతుందో, తన తల్లి నడవడం కోసం ఆరాధ్య సాయం చేసిన వీడియోలు కూడా అంతే వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఐశ్వర్య రాయ్ కుడిచేతికి కట్టు ఉంది. మరోవైపు తను చాలా పెద్ద గౌన్ ధరించింది. దీంతో తనకు ఆ గౌన్‌లో మెట్లు దిగడం ఇబ్బందిగా మారింది. అప్పుడే ఆరాధ్య.. తన తల్లి చేయి పట్టుకొని మెల్లగా మెట్లు దిగడానికి సహాయపడింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. 12 ఏళ్ల ఆరాధ్య.. తన తల్లికి ఎంత సాయం చేస్తుంది అంటూ నెటిజన్లు ప్రశంసించడం మొదలుపెట్టారు.
HQs - Wherever Aishwarya goes, Aaradhya follows ❤️
— Bewitching Bachchans (@TasnimaKTastic) May 16, 2024
My queen fulfilling mommy duties even at work not to mention Aaradhya’s equal support to her mother. The upbringing really beams through and through #AishwaryaRaiBachchan #AishwaruaAtCannes pic.twitter.com/SocEXQsTY9
ఆ ఇద్దరే హైలెట్..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఐశ్వర్య రాయ్.. ఒక బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లోని గౌన్‌ను ధరించింది. గౌన్ ముందు వైపు గోల్డెన్ స్టార్మ్ డిజైన్ ఉండగా.. దాని బోర్డర్‌లో మాత్రం అన్నీ గోల్డెన్ ఫ్లవర్స్ డిజైన్‌తో నింపేశారు. దీనిని ఫాల్గునీ షేర్ పీకాక్ డిజైన్ చేశారు. ఎప్పటిలాగానే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ ధరించిన గౌన్ హైలెట్ అయ్యిందని ఫ్యాన్స్ ప్రశంసించడం మొదలుపెట్టారు. అంతే కాకుండా ఐశ్వర్య కూతురు ఆరాధ్య కూడా తల్లిలాగానే బ్లాక్ కలర్ డ్రెస్‌ను ధరించింది. ఆ డ్రెస్‌పై వైట్ కలర్ సీతాకోక చిలుక డిజైన్ కూడా ఉంది. అలా ఐశ్వర్య, ఆరాధ్య.. ఇద్దరూ ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హైలెట్‌గా నిలిచారు. ఈ ఈవెంట్‌కు మరికొందరు ఇండియన్ సెలబ్రిటీలు హాజరయినా కూడా నెటిజన్లు ఎక్కువశాతం ఐశ్వర్య, ఆరాధ్య గురించే మాట్లాడుకుంటున్నారు.
Stunning stunning stunning #AishwaryaRaiBachan #cannes2024 pic.twitter.com/0mhMZij4iI
— Raja (@RajaNunia2) May 16, 2024
Also Read: సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు - భర్తకు విడాకులు ఇచ్చిన 'మొగలిరేకులు' నటి