Committee Kurrollu Trailer: ఊరు జాతరలో చిచ్చు పెట్టిన 'కమిటీ కుర్రోళ్లు' - ఆసక్తి పెంచుతున్న ట్రైలర్
Committee Kurrollu Trailer: మెగా నిహారిక నిర్మాతగా తెరకెక్కిన 'కమిటీ కుర్రోళ్లు' ట్రైలర్ తాజాగా విడుదలైంది. పల్లెటూరు బ్యాక్‌డ్రాప్, ఊరు జాతర నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది.
Committee Kurrollu Trailer: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి సొంతంగా సినిమాలు నిర్మిస్తోంది. ఆమె బ్యానర్ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9వ తేదీన థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
పల్లెటూరు నేపథ్యంలో సాగే కథాంశంతో కమిటీ కుర్రాళ్లను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ట్రైలర్ మొత్తం ఊరు జాతర నేపథ్యంలో చూట్టూ సాగింది. ఎన్నో ఏళ్లుగా ఆ ఊర్లో ఆనవాయితిగా జరుగుతున్న జాతర ఆ ఊర్లోని స్నేహితుల వల్ల వివాదంలో నిలుస్తుంది. ప్రధానంగా ఊర్లో క్యాస్ట్ ఫీలింగ్స్, మతం, రాజకీయాలు వల్ల స్నేహితులు ఎలా విడిపోయారు? వారి మధ్య గొడవలకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అనేది ఆసక్తి కలిగిస్తుంది. ఇక చదువుల్లో రిజర్వేషన్ల వంటి సున్నితమైన అంశాన్ని కూడా డైరెక్టర్ టచ్ చేశాడు.
ట్రైలర్ విషయానికి వస్తే..
చిన్నప్పటి నుంచి కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఓ ఊరిలో ఉండే కుర్రాళ్లంతా పెరిగి పెద్దవుతారు. ఊరి జాతరను ఘనంగా జరుపుకునే ఆ ఊర్లో కులాలు, మతాలంటూ గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలు ఎంత వరకు వెళతాయంటే స్నేహితులు ఒకరినొకరు తిట్టుకునేంత వరకు, ఒకరినొకరు కొట్టుకునేంత వరకు వీరి గొడవలకు భయపడి ఊర్లో జాతర జరుపుకోవాలంటే భయపడుతుంటారు. ఆ సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చక్కగా ఆవిష్కరించారు. ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్‌గా ఆకట్టుకునేగా డైలాగ్స్‌తో మూవీ ట్రైలర్‌ను సాగింది. ట్రైలర్‌లోని సన్నివేశాలు చూస్తుంటే చాలా సహజ సిద్ధంగా అనిపిస్తున్నాయి. స్నేహం గొప్పదనాన్ని తెలియజెప్పటానికి ఆ స్నేహితులుఫ్రెండ్స్ ఏం చేశారో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది. ఈ ట్రైలర్‌లో ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఓ మంచి మెసేజ్ ఇచ్చాడు. దీంతో ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాపై ఈ ట్రైలర్‌తో అంచనాలు మరింతగా పెరిగాయి.
ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రలన్ని కూడా కొత్త నటీనటులే. ఈ సినిమాలో మొత్తం 20 మంది కొత్తగా నటీనటులు పరిచయం అవుతున్నారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక అనే కొత్త నటీనటులు ప్రధాన పాత్రలుగా నటిస్తున్న కమిటీ కుర్రోళ్లులో సీనియర్ నటులు సాయి కుమార్‌తో పాటు సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, ప్రసాద్ బెహరాతో పాటుగా మరికొంత మంది కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది.