అన్వేషించండి

Chiranjeevi - Zebra: ఉత్తరాంధ్ర యాసలో చిరంజీవి రిప్లై అదుర్స్... మెగాస్టార్ పాటలకు దుమ్మురేపిన సత్యదేవ్ - ‘జీబ్రా’ ప్రీ రిలీజ్ హైలెట్స్

Zebra Pre Release Event: సత్యదేవ్ హీరోగా తెరకెక్కుతున్న ‘జీబ్రా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు.

Zebra Pre Release Event Highlights: మెగాస్టార్ చిరంజీవి ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లోనూ ఫుల్ ఫన్నీగా ఉంటారు. తన ఫ్యాన్స్ తో పాటు తోటి ఇండస్ట్రీ మిత్రులతోనూ ఫన్ చేస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ‘జీబ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఆయన ఫన్నీగా అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు. చిరంజీవి మాట్లాడుతుండగా ఓ అభిమాని “బాసూ నిన్ను చూసేందుకు వైజాగ్ నుంచి వచ్చాను” అని కేక వేయడంతో మెగాస్టార్ రెస్పాండ్ అయ్యారు. “అయితే, ఏటంటావ్ ఇప్పుడు? నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే. మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్ లో ఆడించాలి. భలేవాడివే!” అని ఉత్తరాంధ్రయాసలో ఉన్నారు. దీంతో ఈవెంట్ పాల్గొన్నవాళ్లంతా చప్పట్లు కొడుతూ నవ్వుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరంజీవి టైమింగ్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. “మీరు ఏ ఏ యాసలోనైనా ఆకట్టుకుంటున్నారు బాసూ” అని కామెంట్స్ పెడుతున్నారు. అటు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలంటూ చిత్రబృందానికి చిరంజీవి ఆల్ ది బెస్ట్ చెప్పారు.   

‘జీబ్రా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్..

⦿మోక్షజ్ఞ సినిమాతో బిజీగా ఉన్నా..

‘జీబ్రా’ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ప్రశాంత్ వర్మ పాల్గొన్నారు. మోక్షజ్ఞ సినిమాతో బిజీగా ఉన్నా, చిరంజీవి వస్తున్నాడని ఈ వేడుకకు హాజరైనట్లు చెప్పారు. “ప్రస్తుతం బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ తొలి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. ఈ సినిమాను సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నాను. సత్యదేవ్ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి గారు గెస్టుగా వస్తున్నాడని తెలిసింది. ఆ సినిమా పనులను పక్కన పెట్టి, ఈ సినిమా వేడుకలో పాల్గొన్నాను” అని ప్రశాంత్ వర్మ తెలిపారు.   

⦿కొటు వేసుకుని వద్దాం అనుకున్నాను, కానీ..

‘జీబ్రా’ వేడుకలో సుమ చెప్పిన కోటు ముచ్చట అందరినీ నవ్వించింది. గతంలో ఓ సినిమా వేడుకలో సుమ కోటు వేసుకుని కనిపించింది. అప్పుడు ఆమెను చూసి చిరంజీవి తన భార్య సురేఖకు కాల్ చేస్తారు. “సురేఖ నీ సూటు, ప్యాంట్ కనిపించడం లేదు. ఎవరో ఎత్తుకెళ్లి పోయావని చెప్పావు కదా.. నువ్వేం వర్రీకాకు. దొరికింది. ఎక్కడికి పోదు. ఆ అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. మన సుమే. ఎప్పుడు ఇంటికి వచ్చిందో? ఎప్పుడు తన చేతికి పని చెప్పిందో? ఇచ్చేస్తుంది” అని అంటారు. ‘జీబ్రా’ ఈవెంట్ లో ఆమె ఈ విషయాన్ని గుర్తు చేశారు. “ఈ రోజు నేను కోటు వేసుకుని వద్దాం అనుకున్నాను చిరంజీవి గారూ.. కానీ, మీ ఇంట్లో రెండో కోటు అవుతుందని వేసుకురాలేదు” అని చెప్పడంతో చిరంజీవి నవ్వారు.

⦿చిరంజీవి పాటలకు సత్యదేవ్ డ్యాన్స్

ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి పాటకు హీరో సత్యదేవ్ అదిరిపోయే డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. ‘ఠాగూర్’ సినిమాలోని కొడితే కొట్టాలి రా సాంగ్ కు అచ్చం చిరంజీవిలా డ్యాన్స్ చేసిన అలరించారు. ప్రస్తుతం సత్యదేవ్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

ఈ నెల 22న ‘జీబ్రా’  విడుదల

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోలు సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ ‘జీబ్రా’ సినిమాను తెరకెక్కించారు.  ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిక్కినాటో హీరోయిన్స్‌‌. సత్యరాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న విడుదల కానుంది.

Read Also: ‘హ్యారీ పోటర్‌’ రేంజ్‌లో ‘ది రాజా సాబ్’, ప్రభాస్ మూవీలో కీ పాయింట్స్ రివీల్ చేసిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Embed widget