అన్వేషించండి

Bro Movie 1st Single : మై డియర్ మార్కండేయ - మామ అల్లుళ్ళ పాట రెడీ!

My Dear Markandeya Song : పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా 'బ్రో'. ఇందులో తొలి పాట విడుదలకు ఇంకెంతో సమయం లేదు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన సినిమా 'బ్రో'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. సముద్రఖని దర్శకుడు. జూలై 28న ఈ  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఇందులో మొదటి పాట విడుదలకు అంతా రెడీ అయ్యింది.

జూలై 8న సాయంత్రం 04.05 గంటలకు...
'బ్రో' సినిమాలో మోడ్రన్ భగవంతునిగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. మార్క్ అలియాస్ మార్కండేయులుగా సాయి ధరమ్ తేజ్ కనిపిస్తారు. మామ అల్లుళ్లు... ఇద్దరిపై తెరకెక్కించిన 'మై డియర్ మార్కండేయులు' పాటను జూలై 8వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. 

పవన్, సాయి తేజ్... గతంలో ఇద్దరితోనూ తమన్ పని చేశారు. ముఖ్యంగా పవన్ 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' సినిమాలకు తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది. దాంతో 'బ్రో' పాటలపై మీద అంచనాలు పెరిగాయి. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్ నేపథ్య సంగీతం అభిమానులను ఆకట్టుకుంది.

Also Read : ఆగస్టులో వైష్ణవ్ తేజ్, శ్రీ లీల 'ఆదికేశవ' విడుదల - ఎప్పుడంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by People Media Factory (@peoplemediafactory)

ఆ అమ్మాయి ఎవరు బ్రో?
'బ్రో' టీజర్ చూశారా? అందులో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మాత్రమే కాదు... ఓ హీరోయిన్ కూడా ఉన్నారు! సరిగ్గా 65 సెకన్ల దగ్గర పాజ్ బటన్ నొక్కి చూడండి. సాయి ధరమ్ తేజ్ ఎందుకో ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఆయన వెనుక చేతులు కట్టుకుని ఓ అమ్మాయి నిలబడింది. ఆమె ఎవరో తెలుసా? ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier).

Also Read నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?

'బ్రో'లో రొమాంటిక్ భామ కేతికా శర్మ కూడా ఉన్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. అందులో మామా అల్లుళ్ళతో కలిసి ఆవిడ స్టెప్పులు వేశారు. ఊర్వశి రౌతేలా ఒక్కో పాటకు మినిమమ్ 50 లక్షల రూపాయలు తీసుకుంటారని టాక్. ఆవిడ రెమ్యూనరేషన్ కంటే నాలుగైదు రేట్లు పాట కోసం ఖర్చు పెట్టారని తెలిసింది. సెట్స్, లైటింగ్... ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదని తెలిసింది.

'బ్రో' సినిమాలో సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), నర్రా శ్రీను, యువ లక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ప్రధాన తారాగణం. ఇంకా ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఏ.ఎస్. ప్రకాష్, కూర్పు : నవీన్ నూలి, పోరాటాలు : సెల్వ, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్, సంగీతం :  ఎస్.ఎస్. థమన్,  సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల,  నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & జీ స్టూడియోస్, నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, కథనం & మాటలు : త్రివిక్రమ్ శ్రీనివాస్, రచన & దర్శకత్వం : పి. సముద్రఖని. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలుమేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డిManmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Embed widget