Balakrishna Movie Postponed : మళ్ళీ వాయిదా పడిన బాలకృష్ణ సినిమా రీ రిలీజ్ - ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు!
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓ సినిమా రీ రిలీజ్ మళ్ళీ వాయిదా పడింది.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓ సినిమా రీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది.
బాలకృష్ణ ప్రయోగాలకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఆయనకు అందగాడు ఇమేజ్ ఉన్నప్పటికీ... కమర్షియల్ కథానాయకుడిగా వరుస విజయాలతో మాంచి జోరు మీద ఉన్నప్పటికీ... 'భైరవ ద్వీపం'లో క్యారెక్టర్ కోసం సిల్వర్ స్క్రీన్ మీద అందవిహీనంగా కనిపించారు. ఆ సినిమాను ఆగస్టులో రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే... కుదరలేదు.
రెండుసార్లు వాయిదా పడిన 'భైరవ ద్వీపం' రీ రిలీజ్!
వైవిధ్యమైన కథలను స్వాగతించే నందమూరి బాలకృష్ణ, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao)తో కలిసి చేసిన సినిమాల్లో 'భైరవ ద్వీపం' ఒకటి. ఏప్రిల్ 14, 1994న తొలిసారి ఆ సినిమా విడుదలైంది. పలు రికార్డులను అప్పట్లో క్రియేట్ చేసింది. ఆ సినిమాను క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థ రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది. మొదట ఆగస్టు 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అనివార్య కారణాల వల్ల కుదరలేదు.
ఆగస్టు 5న 'భైరవ ద్వీపం' రీ రిలీజ్ కాలేదు. దాంతో ఆగస్టు 30న రీ రిలీజ్ చేస్తామని క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ పేర్కొంది. అయితే... ఈసారి కూడా రిలీజ్ కాలేదు. దాంతో నందమూరి అభిమానులకు ఆ సంస్థ సారీ చెప్పింది.
Also Read : బాలయ్య వస్తే తీన్మార్ కాదు, సౌమార్ కొట్టాల్సిందే - 'భగవంత్ కేసరి' ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
#BhairavaDweepam4k 🙏
— Claps Infotainment (@ClapsInfotain) August 30, 2023
We @ClapsInfotain made all efforts to bring #NandamuriBalakrishna's
Bhairava Dweepam movie in 4K in theaters today to give a good experience to the audience. pic.twitter.com/vd8GzcnjX6
'భైరవ ద్వీపం' కథకు వస్తే...
'భైరవ ద్వీపం' సినిమాలో బాలకృష్ణ ఒక తెగలో ఎదుగుతున్న రాకుమారుడు విజయ్ పాత్రలో ధైర్య సాహసాలు కలిగిన వీరుడిగా కనిపిస్తారు. విజయ్ కార్తికేయ రాజ్యానికి చెందిన యువరాణి పద్మావతి (రోజా)తో విజయ్ ప్రేమలో పడతారు. అయితే, ఒక దుష్ట మాంత్రికుడు పద్మావతిని బలి ఇవ్వడానికి 'భైరవ ద్వీపం' పేరు గల ద్వీపానికి మాయాజాలం ద్వారా తీసుకు వెళతాడు. అక్కడ నుంచి యువరాణిని విజయ్ ఎలా కాపాడాడు? అనేది కథ.
Also Read : 'ఖుషి' ప్రీ రిలీజ్ డీటెయిల్స్ - విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఎంత?
'భైరవ ద్వీపం' సినిమాకు రావి కొండల రావు కథ అందించారు. ఆ కథకు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించారు. కథ, కథనాలు సినిమాలో హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం మరో హైలైట్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : కబీర్ లాల్, కూర్పు : డి. రాజ గోపాల్. ఈ సినిమాను చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి. వెంకట రామి రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం తొమ్మిది నంది అవార్డులను సొంతం చేసుకుంది.
కైకాల సత్యనారాయణ, విజయ కుమార్, రంభ, విజయ రంగరాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబు మోహన్, మిక్కిలినేని, పద్మనాభం, సుత్తివేలు, కోవై సరళ, చిట్టి బాబు, కె.ఆర్. విజయ, మనోరమ, సంగీత, రజిత, కోవై సరళ ఈ సినిమాలో ఇతర తారాగణం.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial