Shraddha Srinath In NBK 109: బాలకృష్ణ సరసన ఎన్‌బికె 109లో శ్రద్ధా శ్రీనాథ్... అఫీషియల్ గురూ!
Balakrishna Upcoming Movie: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్న విషయాన్ని ఇవాళ అనౌన్స్ చేశారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు ఎన్.బి.కె 109 (NBK 109 Movie) సినిమా యూనిట్ కొత్త బిరుదు ఇచ్చింది. ఆయన్ను 'న్యాచురల్ బోర్న్ కింగ్'గా పేర్కొంది. ఇప్పటికే విడుదల చేసిన రెండు వీడియో గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే... ఆ రెండిటిలో హీరోయిన్ ఎవరు అనేది చెప్పలేదు. ఈ రోజు ఆ సస్పెన్సుకు తెర దించారు.
బాలకృష్ణ సరసన కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్
Shraddha Srinath On Board For NBK 109: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలు. ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నట్లు ఈ రోజు వెల్లడించారు.
సితార సంస్థలో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్న రెండో చిత్రం ఇది. నాచురల్ స్టార్ నాని హీరోగా ఆ సంస్థ నిర్మించిన 'జెర్సీ' సినిమాలో కూడా ఆవిడ నటించారు. తెలుగులో ఆవిడ తొలి విజయం అందుకోవడానికి కారణం సితార సంస్థ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ సంస్థలో మరో సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకుడితో నటించే అవకాశం అందుకున్నారు. ఈరోజు సెప్టెంబర్ 29న శ్రద్ధా శ్రీనాథ్ పుట్టిన రోజు (Shraddha Srinath Birthday) సందర్భంగా ఈ విషయం అనౌన్స్ చేశారు. ఆమెను తమ చిత్ర బృందంలోకి స్వాగతిస్తూ ఒక పోస్ట్ చేశారు.
Also Read: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్న ఐశ్యర్య, కరణ్ - IIFA 2024లో నట సింహం కాళ్లకు నమస్కరించిన స్టార్స్
Wishing the immensely talented @ShraddhaSrinath a very Happy Birthday! - Team #NBK109 🔥#HBDShraddhaSrinath ✨
— Sithara Entertainments (@SitharaEnts) September 29, 2024
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @dirbobby @MusicThaman @thedeol @Vamsi84 #SaiSoujanya @Rishi_vorginal @KVijayKartik @NiranjanD_ND @chakrif1… pic.twitter.com/tvmnvd9Uqg
బాలకృష్ణకు ప్రతినాయకుడిగా బాబి డియోల్!
బాలకృష్ణ, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి బాబి కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రతి నాయకుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో, 'యానిమల్' సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన బాబి డియోల్ (Bobby Deol) నటిస్తున్నారు.
Also Read: వెంకీ మామతో దేవిశ్రీ స్టెప్పులు - ఐఫా 2024లో గ్లామరస్ పెర్ఫార్మన్స్‌లు... ఫోటోలు చూడండి
మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ఎన్.బి.కె 109 మూవీ ఫస్ట్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఆ తరువాత బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మరొక స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఆ రెండు సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై అంచనాలను కూడా పెంచాయి. జాలి దయాకర్ణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు అంటూ బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు నందమూరి అభిమానులను మాత్రమే కాదు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనే ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.