Anantapur News Today: వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
Medical Student Death Today: డిసెంబర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యుడిగా ప్రజలకు సేవ చేయాల్సిన విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ చదువుల ఒత్తిడి భరించలేనంటూ లెటర్ రాసి చనిపోయాడు.
Medical Student Suicide News In Anantapur: అనంతపురంలో చదువు ఒత్తిడి భరించలేక వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్న రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వైద్య కళాశాలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇంటికి వస్తున్నా నాన్న అని చెప్పి...
ఉరవకొండ మండల కేంద్రం షిరిడి సాయి నగర్‌కు చెందిన గిద్దలూరు శివప్రసాద్ శారద ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరి కుమారుడే రోహిత్. అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అదే వైద్య కళాశాలలోని వసతి గృహంలో ఉంటున్నాడు. పరీక్షల విషయంలో తరచు ఒత్తిడికి గురవుతుండేవాడని సహచర విద్యార్థులు చెబుతున్నారు.
ఒత్తిడికి గురవుతున్న కారణంగా గతంలో కౌన్సిలింగ్ ఇప్పించారు తల్లిదండ్రులు. డిసెంబర్‌లో 10 12 తేదీల్లో ఫైనల్ ఇయర్ పరీక్షలో ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం తన తండ్రి ఫోన్ చేసిన ఇంటికి వస్తున్నానని చెప్పాడు. సాయంత్రం ఉంటున్న గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటికి వస్తున్నా అని చెప్పిన కుమారుడు ఇంకా ఇంటికి రాలేదని తండ్రి రోహిత్‌కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. తన వసతి గృహంలో ఉంటున్న సహచార విద్యార్థికి ఫోన్ చేశాడు. తండ్రి ఫోన్‌తో వాళ్లు రోహిత్ గది వద్దకు వెళ్లి డోర్ కొట్టారు. తలుపు తీయలేదు. దీంతో కిటికీ నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
రోహిత్‌ను అలా చూసి కంగారు పడ్డ విద్యార్థులు విషయాన్ని హాస్టల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు పోలీసులకు ఇన్‌ఫామ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోహిత్ మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఐ యాం రెస్పాన్సిబుల్ ఫర్ మై డెత్ అంటూ సూసైడ్ నోట్
వైద్య కళాశాల విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో రంగంలోకి దిగిన పోలీసులు వైద్య కళాశాల అధికారులను, హాస్టల్ అధికారులను విచారించారు. సహచర విద్యార్థులతో కూడా పోలీసులు మాట్లాడారు. మృతుడి వసతి గృహంలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడంతో మృతుడు ముందుగానే తాను చనిపోతున్నట్లు ఒక సూసైడ్ నోట్ రాసి ఉంచినట్లు గుర్తించారు. అందులో ఐ యాం రెస్పాన్సిబిలిటీ మై డెత్ అంటూ రాసుకున్నాడు. పరీక్షల ఒత్తిడిని భరించలేకున్నానని వివరించాడు. ఆ ఆలోచన నుంచి నేను బయటకు రాలేకపోతున్న అయోమయంగా ఉందని వాపోయాడు. ఏకాగ్రత చేయలేకపోతున్నానని ఆ లేఖలో రాసి పెట్టాడు.
ఈ విద్యార్థితోపాటు చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురి అవుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. విద్యార్థుల ఒత్తిడి తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు.
Also Read: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్