KA Movie OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
KA Movie OTT Platform: కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. దీంతో రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయారు. ఈ సినిమా ఈటీవీ విన్ యాప్ లో కొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది.
Kiran Abbavaram's KA OTT Release Date: కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా మొదలైనప్పుడు, ఈ సినిమాపై పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు. కిరణ్ అబ్బవరం కెరీర్ లో ‘రాజా వారు రాణివారు’, ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ సినిమాలను మినహాయిస్తే, ’సెబాస్టియన్ పి.సి 534’ నుంచి మొన్నా మధ్య వచ్చిన ‘రూల్స్ రంజన్’ వరకూ అన్నీ కమర్షియల్ మీటర్ లో ఉన్నవే, ఫ్లాపులే. మధ్యలో కొన్ని ఫ్లాప్ లు కూడా అందుకున్న కిరణ్ అబ్బవరం తన రూట్ మార్చి తీసిన సినిమా ‘క’. టీజర్, ట్రయిలర్ల నుంచే ‘క’ సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. అంతే కాకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ సమయంలో కిరణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ సినిమా పై సోషల్ మీడియాలో సింపతీని క్రియేట్ చేశాయి. సినిమాలో అక్కడక్కడా లోపాలు ఉన్నా, ప్రేక్షకులు అవేవీ పట్టించుకోలేదు. ఘన విజయాన్ని అందించి, 50 కోట్ల క్లబ్ లో చేర్చారు. సుజిత్, సందీప్ ద్వయం తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి నాడు విడుదలైంది.
రేపట్నుంచి ఈటీవీ విన్ లో ‘క’ స్ట్రీమింగ్
KA OTT Partner: ‘క’ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గురువారం (నవంబర్ 28న)... అంటే మరికొన్ని గంటల్లో సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులో అందుబాటులోకి వస్తుంది.
Also Read: ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే?
View this post on Instagram
కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా కథ ఏమిటంటే?
మధ్యాహ్నం మూడు గంటలకే చీకట్లు కమ్ముకొనే ఊరు... అక్కడ ఉండే అభినయ్ వాసుదేవ్ అనే పోస్ట్ మ్యాన్ ల చుట్టూ ‘క’ కథాకథనాలు సాగుతాయి. వాసుదేవ్ తో పాటు ఆ ఊళ్లో ఉండే రాధ అనే అమ్మాయిని కొంత మంది అజ్ఞాత వ్యక్తులు కిడ్నాప్ తో ఈ సినిమా మొదలవుతుంది. అభినయ్ కి తాను పోస్ట్ చేసే ఉత్తరాలను చదివే అలవాటు ఉంది. అది చిన్న తనం నుంచే వచ్చింది. ఈ కారణంగా వాసుదేవ్ ఓ తప్పు చేస్తాడు. ఆ కారణంగానే కిడ్నాప్ చేశానని చెబుతాడు ఆ ముసుగు వ్యక్తి . మరి వాసుదేవ్ కారణంగా జరిగిన తప్పు ఏంటి? ఆ తర్వాత వాసుదేవ్ సరిదిద్దుకున్నాడా? అన్ని మిగతా కథ.
Also Read: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే?
మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా కిరణ్ కెరీర్ ను మలుపు తిప్పింది. నయనా సారిక, తాన్వి రామ్, ‘కేజీఎఫ్’, ‘కాంతార’ చిత్రాల ఫేమ్ కన్నడ నటుడు అచ్యుత్ కుమార్, తమిళ నటుడు రెడిన్ కింగ్ స్లే ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా కు సామ్ .సి.ఎస్ స్వరకర్త. కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రంతో పాపులర్ అయిన శామ్ ఇప్పుడు ‘పుష్ప 2’ కి కూడా నేపథ్య సంగీతం వినిపిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ‘క’ చిత్రం మలయాళ వెర్షన్ రైట్స్ ను హీరో దుల్కర్ సల్మాన కొనుగోలు చేసి, ఈ నెల 22న కేరళ లో విడుదల చేశారు.