Lucky Bhaskar OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన 100 కోట్ల సినిమా... ఐదు భాషల్లో దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' స్ట్రీమింగ్
Lucky Bhaskar OTT Platform: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ స్ట్రీమింగ్ గురించి ఆడియన్స్ కూడా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. రేపటి నుంచే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది
Dulquer Salmaan's Lucky Baskhar OTT Release Date On Netflix: ‘లక్కీ భాస్కర్’తో దుల్కర్ సల్మాన్ రూ. 100 కోట్ల క్లబ్బులో చేరిపోయారు. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. తెలుగులో దుల్కర్‌కు మరో హిట్ అందించింది. ఇప్పుడీ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలో విడుదల కానుంది.
రేపట్నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘లక్కీ భాస్కర్’ స్ట్రీమింగ్
Lucky Bhaskar OTT Partner: ‘లక్కీ భాస్కర్’ ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గురువారం (నవంబర్ 28న)... అంటే మరికొన్ని గంటల్లో సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాలో అందుబాటులోకి వస్తుంది.
Judham lo entha goppaga aadamu ani mukyam kaadhu, eppudu aapamu annadhe mukyam.💸
— Netflix India South (@Netflix_INSouth) November 26, 2024
Watch Lucky Baskhar on Netflix, out 28 November in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi! #LuckyBaskharOnNetflix pic.twitter.com/lVmtTIVybq
Also Read: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే?
అప్పటి బొంబాయిలోని సాదాసీదా మధ్య తరగతి వ్యక్తి భాస్కర్. అతనికి ఓ భార్య, కూతురు. బ్యాంకులో ఉద్యోగం. ఆరు వేల జీతం. 80వ దశకంలో ఆరు వేల జీతం. కానీ చుట్టూ అప్పులు. ఎలాగైనా తీర్చాలి. తనకు కుటుంబం కంటే ఏదీ ఎక్కువ కాదు. అందుకే రిస్క్ చేశాడు. బ్యాంకింగ్ వ్యవస్థలోని ఒక లూప్ హోల్ పట్టుకున్నాడు. భాస్కర్ రిచ్ అయ్యాడు. సంపాదనలో దూసుకెళ్లాడు. డబ్బుతో పాటు కాస్త పొగరు కూడా సంపాదించాడు. అతని వ్యక్తిత్వం ఎలా మారింది? లక్కీ భాస్కర్ అని టైటిల్ లోనే ఉంది కాబట్టి, అసలు ఎలా లక్కీ అయ్యాడు? అతని తెలివితేటలతో అన్ని అడ్డంకులను ఎలా దాటాడు? అన్నదే ఈ సినిమా. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ను ఎప్పుడో మన తెలుగు ప్రేక్షకులను ఓన్ చేసుకున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాలతో మరింత చేరువయ్యారు. దీంతో మరో హిట్ ఆయన ఖాతాలో పడింది.
సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాత బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ‘లక్కీ భాస్కర్’ దీపావళి తారాజువ్వలా ఎగసి, బాక్సాఫీస్ హిట్ కొట్టింది. 80వ దశకాలకు చెందిన ఓ పీరియాడిక్ చిత్రంగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకర్త. మీనాక్షి చౌదరి కథానాయిక. రాంకీ, సాయికుమార్, టినూ ఆనంద్, సచిన్ ఖేడ్కర్, సూర్య శ్రీనివాస్, మానస చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.
వెంకీ అట్లూరి... హీరో టు డైరక్టర్!
దర్శకుడిగా వెంకీ అట్లూరికి వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’ మొదటి సినిమా. హీరోగా చేసినా సరే, వర్కవుట్ కాకపోవడంతో దర్శకునిగా మారారు వెంకీ. ఆయన తెరకెక్కించిన మొదటి చిత్రం ‘తొలి ప్రేమ’ హిట్ అయింది. ఇక అఖిల్ తో ‘మిస్టర్ మజ్నూ’, నితిన్ తో ‘రంగ్ దే’ లాంటి లవ్ స్టోరీలు చేసినా, ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అప్పుడే తన రూట్ మార్చి, తమిళ నటుడు ధనుష్ తో ‘సర్’ చిత్రం తీసి అందర్నీ అలరించారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా వైవిధ్యమైన సామాజిక చిత్రంగా వెంకీ కెరీర్ లో నిలిచిపోయింది. తాజాగా దుల్కర్ తో ‘లక్కీ భాస్కర్’ తీసి తాను లక్కీ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నారు.