Akhanda 2 Release Date: 'అఖండ 2' ప్రెస్ మీట్ లేదు... డైరెక్టుగా థియేటర్లలో నట సింహ గర్జన
Akhanda 2 Premiere Show Update: డిసెంబర్ 11వ తేదీ రాత్రి 'అఖండ 2 తాండవం' ప్రీమియర్ షో ప్రదర్శనకు ఏర్పాట్లు జరిగాయి. అయితే ముందు ఈవెంట్ లేదా ప్రెస్ మీట్ వంటివి ఏవీ లేవు.

థియేటర్లలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సింహ గర్జనకు అంతా సిద్ధమైంది. 'అఖండ 2' (Akhanda 2)తో నట తాండవం చేయబోతున్నారు బాలయ్య. డిసెంబర్ 11వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలతో సినిమా విడుదల కానుంది. థియేటర్లలో సందడికి ముందు ఈవెంట్ లేదా ప్రెస్ మీట్ వంటివి నిర్వహించాలని చిత్ర బృందం అనుకోవడం లేదు.
డైరెక్టుగా థియేటర్లలోకి సినిమా...
ఈవెంట్ కోసం ఎదురు చూపులు వద్దు!
డిసెంబర్ 5న థియేటర్లలోకి వస్తుందని భావించిన 'అఖండ 2 తాండవం' విడుదల అనూహ్యంగా వాయిదా పడింది. నిర్మాతలను ఆర్థిక సమస్యలు, గత సినిమాలకు చేసిన అప్పులు వెంటాడటంతో రిలీజ్ క్యాన్సిల్ అవ్వక తప్పలేదు. ఇప్పుడు ఒక్క ఫైనాన్షియల్ ఇష్యూ లేదు. సమస్యలు అన్నీ పరిష్కరించిన 14 రీల్స్ ప్లస్ సంస్థ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట... భారీ ఎత్తున విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
'అఖండ 2' విడుదల నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ లేదా ఈవెంట్ ఒకటి నిర్వహిస్తుందని కొంత మంది అభిమానులు, ప్రేక్షకులు భావించారు. అయితే అటువంటి ప్లాన్ ఏదీ లేదు. డిసెంబర్ 11న ప్రీమియర్లు, డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ వంటివి నిర్వహించే ఆలోచన నిర్మాతలకు లేదు.
తప్పకుండా 'అఖండ 2' సక్సెస్ మీట్!
Akhanda 2 Success Meet: డిసెంబర్ 13 లేదా 14... రాబోయే శని, ఆది వారాల్లో 'అఖండ 2 తాండవం' సక్సెస్ మీట్ నిర్వహించే ఆలోచనలో దర్శకుడు బోయపాటి శ్రీను & నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. సనాతన ధర్మం నేపథ్యంలో 'అఖండ 2' రూపొందింది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయం తథ్యమని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అదీ సంగతి!
బాలకృష్ణకు జంటగా సంయుక్త నటించిన 'అఖండ 2 తాండవం'లో ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.





















