అన్వేషించండి

Badshah gift: అభిమానికి లక్షన్నర ఖరీదైన స్నీకర్లు బహుమతిగా ఇచ్చిన బాద్‌షా - నెట్టింట్లో వీడియో వైరల్

హిప్ హాప్ మాగ్నెట్ వ్యవస్థాపకుడు, ర్యాపర్ బాద్ షా తన అభిమానికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. యూట్యూబ్ ఫ్యాన్‌ ఫెస్ట్‌ లో వర్జిల్ అబ్లో రూపొందించిన హై టాప్ లూయిస్ విట్టన్ ట్రైనర్ 2 స్నీకర్లను అందించారు.

సెలబ్రిటీలు సాధారణంగా తమకు సంబంధించిన వస్తువులను అప్పుడప్పుడు అభిమానులకు ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తారు. తాజాగా ర్యాప్ సింగర్ బాద్ షా (Singer Badshah) కూడా తన 15 ఏండ్ల అభిమానికి మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. తాజాగా ఆయన యూట్యూబ్ ఫ్యాన్‌ ఫెస్ట్‌ నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ఓ 15 ఏండ్ల అభిమానికి తనకు ఎంతో ఇష్టమైన స్నీకర్లను గిఫ్ట్ గా ఇచ్చారు.

అభిమానికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ర్యాపర్ బాద్ షా

అభిమానులతో కలిసి యూట్యూబ్ ఫ్యాన్‌ ఫెస్ట్‌ నిర్వహించిన బాద్ షా... ఈవెంట్ లో స్టేజి మీద అదిరిపోయే పాటలతో అభిమానులను అలరించారు. బాద్ షా ర్యాప్ సాంగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ప్రదర్శన అయిపోయాక తన ఇష్టమైన స్నీకర్లను ఓ అమ్మాయికి బహుమతిగా అందించారు.  ముందు వరుసలో నిలబడిన మోనికా బొహ్రా అనే 15 ఏండ్ల యువతి వీటిని అందుకుంది. ముంబైకి చెందిన అమ్మాయికి అందించిన ఈ స్నీకర్ల విలువ సుమారు రూ. 1.50 లక్షలు ($1,660) ఉంటుందట. వీటిని వర్జిల్ అబ్లో రూపొందించారట. లూయిస్ విట్టన్ హై టాప్ స్నీకర్లను అందుకోవడం పట్ల అభిమాని సంతోషం వ్యక్తం చేసింది. తన పుట్టిన రోజునే బాద్ షా నుంచి అరుదైన బహుమతి లభించడం పట్ల ఆమె ఆనందంలో మునిగిపోయింది. సోషల్ మీడియా వేదికగా బాద్ షాకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ అమ్మాయికి నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Monika Bohra (@monika_bohra_art)

బాద్ షా ఏమన్నారంటే?

తన స్నీకర్లను బహుమతిగా ఇవ్వడంపై బాద్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  “నా అభిమానులకు నేను ఎప్పటికి కృతజ్ఞుడిగానే ఉంటాను. వారి ప్రోత్సాహంతోనే నేను మరింత మెరుగ్గా రాణిస్తున్నాను. వారి ప్రేమ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ ప్రేమ, అభిమానాలకు నేను వెలకట్టలేను. నన్ను ఎంతో ఇష్టపడే అభిమానికి నేను ఎంతో ఇష్టపడే స్నీకర్లను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉంది. అభిమానుల ప్రేమ ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.    

బాద్ షా గిష్ట్ గా ఇచ్చిన స్నీకర్ల గురించి..

బాద్‌షా తన అభిమానికి  బహుమతిగా ఇచ్చిన మోడల్‌ను ది LV ట్రైనర్ 2గా పిలుస్తారు. వీటిని దూడ చర్మంతో రూపొందించారు.  క్లాసిక్ వైట్, బ్లాక్ రంగులను కలిగి ఉంది. ఇది 1990ల బాస్కెట్‌బాల్ స్టైలింగ్‌ను సమానంగా ఉంటుంది.  అబ్లో ఆమోదించిన పాతకాలపు స్నీకర్ డిజైన్‌ను సూచిస్తుంది. దాని హీల్ హగ్గింగ్ హై-టాప్ కట్, ఇంకా పెద్ద టంగ్,  అనలాగ్ హుక్ అండ్ లూప్ యాంకిల్ స్ట్రాప్, ప్యాడెడ్ నైలాన్, అల్ట్రా సప్లి నూబక్, అగ్రెసివ్ మిడ్‌సోల్‌తో ఉంటుంది. వీటి తయారీకి సుమారు 7 గంటల సమయం పట్టినట్లు తెలుస్తోంది.  ఇక ప్రస్తుతం బాద్ షా  ఇండియాస్ గాట్ టాలెంట్ S10లో న్యాయనిర్ణేతగా కనిపిస్తున్నాడు. ఇక  శిల్పా శెట్టి  ‘సుఖీ’కి ఆయన సంగీతం అందించారు.

Read Also: దయచేసి ఇకనైనా మారండి- తెలుగు సినిమాపై విమర్శకులు చేసేవాళ్లకు 'హైపర్' ఆది పంచ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
Embed widget