News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Asin Divorce Rumours : ఇన్‌స్టాలో భర్త ఫోటోలు డిలీట్ చేసిన ఆసిన్, విడాకులకు రెడీ? - 'గజినీ' భామ స్పందన ఏంటంటే?

హీరోయిన్ ఆసిన్ విడాకులు తీసుకుంటున్నారని ముంబై మీడియాలో ఓ వార్త గుప్పుమంది. దీనిపై ఆసిన్ రియాక్ట్ అయ్యారు.

FOLLOW US: 
Share:

ఆసిన్ (Asin Thottumkal) గుర్తు ఉన్నారా? తమిళ, హిందీ ప్రేక్షకులు మాత్రమే కాదు... తెలుగు ప్రేక్షకులు సైతం ఆమెను మర్చిపోవడం కష్టమే! 'హృదయం ఎక్కడ ఉన్నది... హృదయం ఎక్కడ ఉన్నది...' పాట ఎప్పటి వరకు వినిపిస్తూ ఉంటుందో? అప్పటి వరకు ఆసిన్ గుర్తు ఉంటారు. 'గజినీ' సినిమా, అందులో పాట అంత పెద్ద హిట్ మరి! సూర్యకు జోడీగా తమిళం, ఆమిర్ ఖాన్ సరసన హిందీలో... 'గజినీ' చేశారు ఆసిన్. 

కథానాయికగా కెరీర్ విజయాలతో దూసుకు వెళుతున్న సమయంలో రాహుల్ శర్మ (Asin Husband Rahul Sharma)ను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యారు. పెళ్లి తర్వాత ఆసిన్ సినిమాలు చేయలేదు. జనవరి 19, 2016లో ఆమె పెళ్లి జరిగింది. పెళ్ళికి నాలుగు నెలల ముందు ఆసిన్ లాస్ట్ సినిమా  'ఆల్ ఈజ్ వెల్' విడుదల అయ్యింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఆసిన్ ప్రస్తావన ఎందుకు అంటే... ఆమె విడాకులు తీసుకోబోతున్నారని ఓ వార్త ముంబై మీడియాలో గుప్పుమంది. 

విడాకుల వార్తలకు కారణం ఏమిటి?
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను ఆసిన్ డిలీట్ చేశారు. ఇప్పుడు ఆమె ప్రొఫైల్ చూస్తే... అందులో భర్త రాహుల్ శర్మతో దిగిన ఫోటో ఒక్కటి కూడా లేదు. అమ్మాయితో దిగిన ఫోటోలు ఉన్నాయి. రిషి కపూర్, ఆమిర్ ఖాన్, ఖుష్భూలతో దిగిన ఫోటోలు ఉన్నాయి. ఆఖరికి రాహుల్ శర్మతో పెళ్లికి కారణమైన అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రాతో దిగిన ఫోటో కూడా ఉంది. రాహుల్ శర్మ ఎక్కడ కనిపించలేదు. దాంతో వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని, విడాకులు తీసుకుంటున్నారని ముంబై జనాల్లో అనుమానాలు మొదలు అయ్యాయి. విడాకులకు ముందు పలువురు సెలబ్రిటీలు ఈ విధంగా ఫోటోలు డిలీట్ చేయడంతో సందేహాలు కలిగాయి. అయితే... ఆసిన్ ఈ సందేహాలకు క్లారిటీ ఇచ్చారు.

పెళ్ళికి ముందూ ఇటువంటి పుకార్లు వచ్చాయి! - ఆసిన్
భర్త రాహుల్ శర్మతో కలిసి వేసవి విహారయాత్రకు వెళ్లినట్లు ఆసిన్ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొన్నారు. ఇద్దరం కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారని, ఇంతలో ఎటువంటి ఆధారాలు లేని ఊహాజనిత వార్త తమ కంట పడిందని ఆసిన్ తెలిపారు. 

తాము విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్త చదివిన తర్వాత పెళ్లి రోజులు గుర్తుకు వచ్చాయని ఆసిన్ చెప్పుకొచ్చారు. ఇంట్లో ఇరువురి కుటుంబాలు కలిసి పెళ్లి ప్లానింగ్ పనుల్లో ఉంటే... తాము విడిపోయామని, బ్రేకప్ అయ్యిందని వార్తలు వచ్చాయని ఆమె గుర్తు చేశారు. వండర్ ఫుల్ హాలిడేలో ఐదు నిమిషాలు వేస్ట్ చేశామని ఆసిన్ అసహనం వ్యక్తం చేశారు. అదీ సంగతి!  

Also Read 'సామజవరగమన' రివ్యూ : కామెడీతో కొట్టిన శ్రీ విష్ణు... సినిమా ఎలా ఉందంటే?

హిందీ హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు... ప్రేమ వివాహాలు చేసుకున్న వారి సంఖ్య చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. అక్షయ్ కుమార్ - ట్వింకిల్ ఖన్నా, అజయ్ దేవగణ్ - కాజోల్, సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్, రణవీర్ సింగ్ - దీపికా పదుకోన్... జంటలు సంసార జీవితంలో సంతోషంగా ముందుకు వెళుతున్నారు. హృతిక్ రోషన్, మలైకా అరోరా వంటి వారు విడాకులు తీసుకున్నారు. 

Also Read ట్విట్టర్ అంకుల్స్‌కు ఇచ్చిపడేసిన తమన్నా - పెళ్ళికి ముందు శృంగారంపై షాకింగ్ కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 28 Jun 2023 04:00 PM (IST) Tags: Rahul Sharma Asin Divorce Actress Asin News Asin Husband

ఇవి కూడా చూడండి

Trisha: ‘యానిమల్’ చిత్రానికి త్రిష షాకింగ్ రివ్యూ - నెటిజన్స్ ట్రోల్ చేయడంతో..

Trisha: ‘యానిమల్’ చిత్రానికి త్రిష షాకింగ్ రివ్యూ - నెటిజన్స్ ట్రోల్ చేయడంతో..

Santosham Film Awards: 'సంతోషం' అవార్డుల్లో కన్నడ స్టార్స్‌కు అవమానం - కొండేటిపై గరం గరం

Santosham Film Awards: 'సంతోషం' అవార్డుల్లో కన్నడ స్టార్స్‌కు అవమానం - కొండేటిపై గరం గరం

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా

Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా

టాప్ స్టోరీస్

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష-  ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు

CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై తీర్మానాలు, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?

CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై తీర్మానాలు, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?

Mizoram Election Result 2023: మిజోరంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, అధికార ప్రభుత్వానికి షాక్!

Mizoram Election Result 2023: మిజోరంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు, అధికార ప్రభుత్వానికి షాక్!
×