![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tamannaah Bhatia : ట్విట్టర్ అంకుల్స్‌కు ఇచ్చిపడేసిన తమన్నా - పెళ్ళికి ముందు శృంగారంపై షాకింగ్ కామెంట్స్
త్వరలో రాబోయే 'లస్ట్ స్టోరీస్ 2' కావచ్చు... తమన్నా చేసిన బోల్డ్ సీన్స్ గురించి చర్చ జరుగుతోంది. ఆన్ స్క్రీన్ రొమాన్స్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేపథ్యంలో తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
![Tamannaah Bhatia : ట్విట్టర్ అంకుల్స్‌కు ఇచ్చిపడేసిన తమన్నా - పెళ్ళికి ముందు శృంగారంపై షాకింగ్ కామెంట్స్ Tamannaah Bhatia On Romance, physical biological needs know all her reactions Tamannaah Bhatia : ట్విట్టర్ అంకుల్స్‌కు ఇచ్చిపడేసిన తమన్నా - పెళ్ళికి ముందు శృంగారంపై షాకింగ్ కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/dcdffe066d084ff3cd71bd2b47fcaf331687929732549313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హైదరాబాదీ యువకుడు, హిందీ నటుడు విజయ్ వర్మతో తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రేమ, 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ (Lust Stories Season 2)లో అతనితో ఇచ్చిన ముద్దులు, ఆ సన్నివేశాలు... ఇప్పుడు మిల్కీ బ్యూటీ ఆన్ స్క్రీన్ & ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ హాట్ హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో చర్చలకు అయితే హద్దు లేదు. ఈ నేపథ్యంలో తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమ్మాయిలు ఎలా ఉండాలో చెబుతారా?
ముఖ్యంగా కథానాయికల వస్త్రధారణ, వేషధారణ, వాళ్ళు చేసే పాత్రలపై మాత్రమే కాదు... అమ్మాయిల వ్యవహార శైలిపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తమన్నా వాళ్ళ గురించి మాట్లాడుతూ ''ఈ ట్విట్టర్ అంకుల్స్ 2023లో కూడా అమ్మాయిలు ఎలా ఉండాలని ఎందుకు చెబుతున్నారు?'' అని ప్రశ్నించారు. వాళ్ళ వ్యాఖ్యలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వడం తనకు బాధగా ఉందని ఆమె చెప్పారు. అందువల్ల, కామెంట్స్ చేసిన వాళ్ళు సూపర్ స్టార్స్ అవుతున్నారని తమన్నా చెప్పారు.
కథానాయికగా తమన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 18 ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్ళలో ఎప్పుడూ ఆన్ స్క్రీన్ హీరోలకు ముద్దు ఇవ్వలేదు. 'నో కిస్సింగ్' రూల్ అమలు చేశారు. విజయ్ వర్మ, 'లస్ట్ స్టోరీస్ 2' కోసం ఆ పాలసీ పక్కన పెట్టినట్లు ముంబై మీడియా పేర్కొంది. అయితే... కొన్ని పాత్రలు చేయడానికి ఆ పాలసీ అడ్డు వస్తున్న కారణంగా ఆన్ స్క్రీన్ ముద్దు పెట్టడానికి రెడీ అయినట్లు తమన్నా తెలిపింది.
భోజనం చేసినట్టే శృంగారమూ...
'లస్ట్ స్టోరీస్ 2' ప్రచార చిత్రాలు చూస్తే... 'కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తారు. మరి, పెళ్ళికి ముందు చేయరా?' అని బామ్మ చెప్పే డైలాగ్ వైరల్ అయ్యింది. ఆ మాటను ఎలా చూస్తారు? అని తమన్నాను ప్రశ్నించగా... ''మనిషి శారీరక అవసరాలకు డర్టీ ట్యాగ్ తగిలించారు. మనం భోజనం చేయాలని ఎలా అనుకుంటామో... అదీ అంతే! అది సహజమే'' అని చెప్పుకొచ్చారు. ఈ అభిప్రాయంపై ట్విట్టర్ అంకుల్స్ ఎలా స్పందిస్తారో?
Also Read : ప్రతిదీ ఓ గుణపాఠమే - డ్రగ్స్ కేసును ఉద్దేశించేనా సురేఖా వాణి?
హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యూనరేషన్ తక్కువ. ఈ విషయం ప్రేక్షకులకూ తెలుసు. సినిమాలో హీరోయిన్లకు ముఖ్యమైన పాత్రలు లభించినా... ఎక్కువ డబ్బు రాదు. ఈ తీరులో మార్పు రావాలంటే ఏం చేయాలని తమన్నాను అడగ్గా... ''అతి పెద్ద సమస్య ఏమిటంటే? హీరోయిన్లను రీప్లేస్ చేయొచ్చనే అభిప్రాయం ఉంది. ఒకవేళ హీరోయిన్లు పెద్ద మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగితే... రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ వస్తుంది'' అని చెప్పారు. హీరోయిన్లు బిగ్గర్ మార్కెట్ రావడం కోసం నిర్ణయాలు తీసుకునే పవర్ కూడా రావాలని ఆమె అభిప్రాయపడ్డారు.
తెలుగులో ఎవరూ రాయలేదు!
తమిళ చిత్రసీమలో చేసినన్ని ప్రయోగాలు తెలుగులో ఎందుకు చేయలేదు? అని తమన్నాను ప్రశ్నించగా... ''ఎవరూ అటువంటి పాత్రలు రాయలేదు'' అని చెప్పారు. వైవిధ్యమైన పాత్రలతో తెలుగు దర్శక, రచయితలు తన దగ్గరకు వస్తే ప్రయోగాలు చేయడానికి సిద్ధమని సంకేతాలను ఆమె ఇచ్చారు. తనను భయపెట్టే పాత్రలు చేయాలని ఉందని, రిస్క్ చేయడానికి తాను సిద్ధమని తమన్నా తెలిపారు.
Also Read : పవర్ స్టార్ లుంగీ లుక్ కిర్రాక్ అంటున్న ఫ్యాన్స్... 'వయ్యారి భామ'ను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)