అషు రెడ్డి ఫోన్ నంబర్ మార్చారు. ఈ మార్పు వెనుక కేపీ చౌదరి డ్రగ్ కేసు ప్రభావం ఏమిటి? తెలుసుకోండి!

పోలీస్ కస్టడీలో అషు రెడ్డికి సైతం డ్రగ్స్ అమ్మినట్లు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ అయిన కేపీ చౌదరి చెప్పారట. 

కేపీ చౌదరితో అషు రెడ్డి  కొన్ని వందల సార్లు ఫోన్ మాట్లాడినట్టు కొన్ని న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేశాయి. 

అషు రెడ్డి ఫోన్ నంబర్ ను కొన్ని ఛానల్స్ పబ్లిక్ లో పెట్టేశాయి. లైవ్ లో నంబర్ చెప్పేశాయి. 

న్యూస్ ఛానల్స్ నంబర్ బయట పెట్టిన తర్వాత ప్రతి సెకన్ ఒక ఫోన్ కాల్ వస్తున్నట్లు అషు రెడ్డి చెప్పారు. 

ఎవరెవరి నంబర్స్ నుంచో వస్తున్న ఫోన్ కాల్స్ తాకిడి తట్టుకోలేక ఆ నంబర్ పక్కన పెడుతున్నట్లు అషు రెడ్డి తెలిపారు. 

తన ఫోన్ నంబర్ బయటపెట్టిన న్యూస్ ఛానల్స్ మీద పరువు నష్టం దావా వేస్తున్నట్లు అషు రెడ్డి చెప్పారు. 

న్యూస్ ఛానల్స్ చెబుతున్నట్టు కేపీ చౌదరికి వందల ఫోన్స్ చేయలేదని, గంటల కొద్దీ మాట్లాడలేదని అషురెడ్డి తెలిపారు. 

డ్రగ్స్ కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని అషు రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. 

అషు రెడ్డితో పాటు జ్యోతి, సురేఖా వాణి సైతం డ్రగ్స్ కేసుతో తమకు సంబంధం లేదని వీడియోలు విడుదల చేశారు.