మలయాళంతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ తన ఉనికిని చాటుకుంటున్న నటి హనీ రోజ్. బాలయ్య నటించిన 'వీరసింహారెడ్డి'తో టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో హనీ బాలయ్యకు మరదలిగా, తల్లిగా తన నటనతో మెప్పించింది. ‘వీరసింహారెడ్డి’ సక్సెస్‌తో ఈ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ బ్యూటీ.. ఫొటో షూట్స్, వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న హనీ రోజ్.. అక్కడ ఉన్న పబ్లిక్‌ను హుషారెత్తిస్తూ స్టెప్పులేసింది. తన అందాలతో విస్ఫోటనం సృష్టించిన బ్యూటీఫుల్ లేడీ హీరోయిన్. బాలకృష్ణ నెక్ట్స్ ఫిల్మ్ 'భగవంత్ కేసరి'లోనూ హనీ రోజ్ నటిస్తోందని సమాచారం. Image Credits: Honey Rose/Instagram