Arbaaz Khan: రెండో పెళ్లికి సిద్ధమయిన సల్మాన్ ఖాన్ సోదరుడు, మేకప్ ఆర్టిస్ట్‌తో డేటింగ్
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్.. రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక నటితో డేటింగ్, బ్రేకప్ తర్వాత మేకప్ ఆర్టిస్ట్‌తో మళ్లీ పెళ్లికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
Malaika Arora Husband : సినీ పరిశ్రమలో బ్రేకప్, విడాకులు.. మళ్లీ పెళ్లి ఇవన్నీ చాలా కామన్‌గా జరుగుతుంటాయి. అక్కడ విడాకులు తీసుకున్న తర్వాత కూడా కపుల్.. ఫ్రెండ్స్‌గా ఉండడానికి ఏ మాత్రం వెనకాడరు. అలా చాలాకాలం క్రితం విడాకులు తీసుకొని మళ్లీ పెళ్లి చేసుకుంటున్నవారి లిస్ట్‌లో మరో బాలీవుడ్ నటుడు జాయిన్ అవ్వనున్నాడు. తనే సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్. సినీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తితోనే అర్బాజ్ ఖాన్.. రెండోపెళ్లికి సిద్ధమవుతున్నాడని బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. తన మాజీ భార్య మలైకా అరోరా.. మరో సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యింది. అర్బాజ్ మాత్రం పలువురితో డేటింగ్ చేస్తూ.. ఎవరితోనూ సీరియస్ రిలేషన్‌షిప్ మెయింటేయిన్ చేయడానికి ఇష్టపడటలేదు. ఈ నేపథ్యంలో అతడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
మళ్లీ పెళ్లి..
అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 19 సంవత్సరాలు కలిసే ఉన్నారు. కానీ పలు మనస్పర్థల వల్ల కపుల్‌గా విడిపోయి.. ఫ్రెండ్స్‌గా కలిసుందామని డిసైడ్ అయ్యారు. అంతే కాకుండా తమ కొడుకు విషయంలో వారిద్దరూ ఇప్పటికీ కలిసే నిర్ణయాలు తీసుకుంటారు. విడాకుల తర్వాత మలైకా అరోరా.. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే విషయం ఓపెన్ సీక్రెట్. ఇక అర్బాజ్ ఖాన్ విషయానికొస్తే.. చాలాకాలంపాటు జార్జియా ఆండ్రియానీ అనే నటితో డేటింగ్ చేశాడు. కానీ ఎందుకో వీరిద్దరికీ సెట్ అవ్వక విడిపోయారు. బ్రేకప్ గురించి వచ్చిన వార్తల గురించి ఇంకా ప్రేక్షకులు మర్చిపోకముందే అర్బాజ్ ఖాన్‌కు మళ్లీ పెళ్లి అని రూమర్స్ వైరల్ అయ్యాయి.
సినిమా సెట్స్‌లో ప్రేమ..
బాలీవుడ్‌లో ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న షురా ఖాన్‌ను అర్బాజ్ ఖాన్ డేట్ చేస్తున్నట్టు బీ టౌన్‌లో ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై చాలా సీరియస్‌గా ఉన్నారని, త్వరలోనే పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారని వార్తలు మొదలయ్యాయి. అర్బాజ్, షురా.. అప్పుడే వారి పెళ్లి తేదీని కూడా ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది. డిసెంబర్ 24న సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనున్నట్టు సమాచారం. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఖాన్ ఫ్యామిలీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అర్బాన్ ఖాన్ ప్రస్తుతం ‘పాట్నా షుక్లా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ మూవీ సెట్స్‌లోనే షురాను కలిశాడని, వెంటనే ప్రేమలో పడిపోయాడని వారి సన్నిహితులు చెప్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.
బ్రేకప్‌పై నటి క్లారిటీ..
ఇప్పటివరకు షురా ఖాన్.. రవీనా టండన్, తన కూతురు రాషా టండన్‌కు రెగ్యులర్ మేకప్ ఆర్టిస్టుగా పనిచేసింది. అయితే షురాకంటే ముందు నాలుగేళ్ల పాటు జార్జియాను డేట్ చేశాడు అర్బాజ్ ఖాన్. ఇక వీరి బ్రేకప్ గురించి జార్జియానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఎప్పటికీ అర్బాజ్‌పై తనకు ఫీలింగ్స్ ఉంటాయని స్పష్టం చేసింది. ప్రేమికులుగా విడిపోయినా.. స్నేహితులుగా కలిసే ఉంటామని క్లారిటీ ఇచ్చింది. మలైకా అరోరా.. అర్బాజ్ పర్సనల్ విషయాల్లో అసలు జోక్యం చేసుకోదని బయటపెట్టింది. కేవలం తమ కొడుకు అర్హాన్ విషయంలో మాత్రమే అర్బాజ్, మలైకా కలిసి కనిపిస్తారని బాలీవుడ్‌లో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్.
Also Read: వాళ్లకు ఆ కోరికలు ఉండవా? సందీప్ రెడ్డి వంగాపై ‘యానిమల్’ స్క్రీన్‌రైటర్ గజల్ ఘాటు వ్యాఖ్యలు