Annie Debut As Heroine : కథానాయికగా మరో బాలనటి - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యానీ 'తికమక తాండ'
'ఖలేజా' నుంచి 'రాజన్న', 'రంగస్థలం' వరకు పలు సినిమాల్లో బాలనటిగా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించిన యానీ త్వరలో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్నారు.
బాలనటి యానీ (Child Artist Annie) గుర్తు ఉందా? తెలుగమ్మాయే! తెలుగులో చాలా సినిమాలు చేసింది. 'ఖలేజా'లో ఓ పాప మరణించిందని భావిస్తారు. మహేష్ బాబు చేతుల్లో శ్వాస తీసుకోవడంతో మళ్ళీ బతికిందని భావిస్తారు. నాగార్జున 'రాజన్న'లో కూడా నటించింది. 'రంగస్థలం'లో రామ్ చరణ్ చెల్లెలి పాత్ర చేసింది. 'లూజర్' వెబ్ సిరీస్ కూడా చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కథానాయికగా పరిచయం అవుతున్నారు.
'తికమక తాండ'తో కథానాయికగా యానీ
రామకృష్ణ, హరికృష్ణ కథానాయకులుగా తెరకెక్కుతున్న సినిమా 'తికమక తాండ' (Thikamaka Thanda Movie). టి.ఎస్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై తిరుపతి శ్రీనివాస రావు నిర్మిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేరన్ దగ్గర... 'ఇష్క్', 'మనం', 'హలో' వంటి హిట్ సినిమాలు తీసిన విక్రమ్ కె. కుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన వెంకట్ దర్శకత్వం వహించారు.
'తికమక తాండ' సినిమాతో యానీ కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో హీరోలు రామకృష్ణ, హరికృష్ణ కవలలు కావడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Also Read : మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఆ హీరో ఇచ్చాడా? - సమంత రెస్పాన్స్ చూశారా?
నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ''అర్ధవంతమైన చిత్రాలు ప్రేక్షకులకు అందించాలని చిత్రసీమలోకి వచ్చా. నిర్మాతగా నా తొలి సినిమా 'తికమక తాండ'. మంచి కథ కుదిరింది. మాటల్లో, సన్నివేశాల్లో ఎక్కడ అసభ్యత లేదు. కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. సురేశ్ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన టీజర్, సిద్ శ్రీరామ్ పాడిన 'పుత్తడి బొమ్మ' పాటకు మంచి స్పందన లభించింది'' అని అన్నారు. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో 1990లో సాగే కథ ఇది. మతిమరుపు అనేది సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న ఒక సమస్య. ఆ సమస్య వల్ల ఒక గ్రామం అంతా బాధ పడుతుంటారు. దాని నుంచి చివరకు ఎలా బయటపడ్డారు? అనేది కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది'' అని చెప్పారు.
Also Read : ట్రెండింగులో ఉంది 'బ్రో' - రెండో వారంలోనూ బాక్సాఫీస్‌లో పవన్ జోరు
రామకృష్ణ, హరికృష్ణ కథానాయకులుగా... యానీ కథానాయికగా నటిస్తున్న 'తికమక తాండ' సినిమాలో శివన్నారాయణ, 'బుల్లెట్' భాస్కర్, యాదమ్మ రాజు, 'రాకెట్' రాఘవ, 'బలగం' సుజాత, వెంకట్, రేఖ నిరోషా, బాబీ బేడీ, రామచంద్ర తదితరులు ప్రధాన తారాగణం.
'తికమక తాండ' చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ : హారిక పొట్ట, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బోజడ్ల శ్రీవాస్, లైన్ ప్రొడ్యూసర్: కోట కరుణ కుమార్, పాటలు : పూర్ణా చారి & లక్ష్మణ్ గంగ, కూర్పు : కుమార్ నిర్మల సృజన్, కళా దర్శకత్వం : శ్రీనివాస్, కథ : బి.ఎన్. నిరూప్ కుమార్, ఛాయాగ్రహణం : హరి కృష్ణన్, సంగీతం : సురేష్ బొబ్బిలి, స్కీన్ ప్లే : వెంకట్ - బి.ఎన్. నిరూప్ కుమార్ - కుమార్ నిర్మల సృజన్, నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు, మాటలు - దర్శకత్వం : వెంకట్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial