Anirudh Ravichander: కావ్యా మారన్‌తో పెళ్లి అంటూ ప్రచారం - అనిరుధ్ రవిచందర్ రియాక్షన్ ఇదే!
Anirudh: కావ్యా మారన్‌తో తన పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంపై మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తాజాగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Anirudh Ravichander About Wedding Rumours With Kavya Maran: ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది అనిరుధ్ రవిచందర్. రజినీ కాంత్, బీస్ట్, రాయన్ వంటి హిట్ మూవీస్‌కు ఆయన మ్యూజిక్ అందించారు. ఆయన పర్సనల్ లైఫ్‌పై గతంలోనే పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తాజాగా.. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు సీఈవోగా వ్యవహరిస్తోన్న కావ్యా మారన్‌తో పెళ్లి అంటూ ప్రచారం సాగుతోంది.
అనిరుధ్ రియాక్షన్
కొంతకాలంగా అనిరుధ్, కావ్యా మారన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అటు సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్‌గా మారింది. వీటిపై తాజాగా అనిరుధ్ స్పందిస్తూ కావ్యతో పెళ్లి వార్తలను ఖండించారు. 'పెళ్లా?.. రూమర్స్ ప్రచారం ఆపండి' అంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దీంతో అదంతా ఫేక్ ప్రచారం అని తేలిపోయింది.
కావ్యా మారన్.. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా తనదైన హావ భావాలతో పాపులర్ అయ్యారు. ఆమెను సోషల్ మీడియాలో అంతా కావ్యా పాప అంటుంటారు. దీనికి కారణం కూడా సూపర్ స్టార్ రజినీకాంత్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిని చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 'స్టేడియంలో కావ్య పాప ఏడవడం చూశానని.. ఆమె అలా ఉండకూడదని.. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి' అంటూ ఓ ఈవెంట్‌లో రజినీ అన్నారు. అప్పటి నుంచీ ఆమెను 'కావ్య పాప' అంటూ నెటిజన్స్ అనడం ప్రారంభించారు.
అనిరుధ్, కావ్య రిలేషన్ షిప్, పెళ్లి అంటూ విస్తృతంగా ప్రచారం సాగడం అటు క్రికెట్, ఇటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా.. అనిరుధ్ స్వయంగా ఫుల్ క్లారిటీ ఇచ్చేయడంతో ఇక రూమర్లకు చెక్ పడినట్లేనని చెప్పాలి.





















