News
News
వీడియోలు ఆటలు
X

Anasuya - Prema Vimanam Movie : 'ప్రేమ విమానం'లో అనసూయ - ఇంకా సంగీత్ & శాన్వి

విమానం మీద అనసూయ మనసు పడినట్లు ఉన్నారు. ఆ పేరుతో రూపొందుతోన్న రెండు సినిమాల్లో ఆమె భాగం అయ్యారు.

FOLLOW US: 
Share:

విమానం (Vimanam Movie)... ఇప్పుడీ పేరు నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)కు బాగా నచ్చినట్లు ఉంది. 'విమానం'లోనూ ఆమె నటిస్తున్నారు. 'ప్రేమ విమానం'లోనూ ఉన్నారు. ఆ పేరుతో రూపొందుతోన్న రెండు సినిమాల్లో అనసూయ భాగం అయ్యారు. అసలు వివరాల్లోకి వెళితే...

'ప్రేమ విమానం' ఫస్ట్ లుక్ వచ్చేసింది!
నిఖిల్ 'కేశవ', అడివి శేష్ 'గూఢచారి', మాస్ మహారాజా 'రావణాసుర' సినిమాలను నిర్మించిన తెలుగు నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా 'డెవిల్' సినిమా నిర్మిస్తోంది. వెండితెరతో పాటు డిజిటల్ తెరపై కూడా ప్రజలకు వినోదం అందించాలని ఓ వెబ్ ఫిల్మ్ నిర్మించింది. 

ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'తో కలిసి అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన సినిమా 'ప్రేమ విమానం' (Prema Vimanam Movie). అభిషేక్ పిక్చర్స్ అధినేత, నిర్మాత అభిషేక్ నామా (Abhishek Nama) పుట్టినరోజు సందర్భంగా సినిమాను అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

'ప్రేమ విమానం'లో బాల నటులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'లో హీరోగా నటించిన సంగీత్ శోభన్ (Sangeet Shobhan) ఇందులో కథానాయకుడు. ఆయన సరసన 'పుష్పక విమానం' ఫేమ్ శాన్వీ మేఘన (Saanve Megghana) కథానాయికగా నటించారు. 'వెన్నెల' కిశోర్, అనసూయ భరద్వాజ్ సైతం ప్రధాన పాత్రలు పోషించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ మీద వీళ్ళందరూ ఉన్నారు. 

'ప్రేమ విమానం' కథ ఏంటంటే?
'ప్రేమ విమానం'లో ప్రతి ఒక్కరి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుందని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఎలాగైనా సరే విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు... ఆఘమేఘాల మీద విమానం ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని తెగ తాపత్రయపడే ఓ ప్రేమ జంట... మరో ఇద్దరు పెద్దలు... అందరూ ఒక్క చోటుకు చేరిన తర్వాత వాళ్ళ ప్రయాణంలోని మలుపులు, సంతోషాలు, బాధల సమాహారమే చిత్ర కథాంశమని 'జీ 5' ఓటీటీ ప్రతినిథులు పేర్కొన్నారు. ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పారు.

Also Read : బిడ్డకు తండ్రి ఎవరు? ఇలియానాపై దారుణమైన ట్రోల్స్

విశేషం ఏమిటంటే... 'జీ స్టూడియోస్' సంస్థ నిర్మిస్తున్న 'విమానం' సినిమాలోనూ అనసూయ కీలక పాత్ర చేశారు. అందులో సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, మీరా జాస్మిన్ ఇతర తారాగణం. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే... వికలాంగుడిగా సముద్రఖని కనిపించారు. ఆ సినిమా కథాంశం కూడా విమానం ఎక్కాలని ఓ చిన్నారి కలలు కనడం మీద ఉంటుంది. కథాంశం ఒక్కటే అయినా కథ, కథనాలు వేర్వేరుగా ఉంటాయని సమాచారం. రెండికి అసలు సంబంధమే ఉండదట.   

'ప్రేమ విమానం' చిత్రానికి సంతోష్ కటా దర్శకత్వం వహించగా... అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జగదీష్ చీకటి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రానికి  కూర్పు : అమర్ రెడ్డి, కళా దర్శకత్వం : గంధి నడికుడికర్, సమర్పణ : దేవాన్ష్ నామా, నిర్మాత : అభిషేక్ పిక్చర్స్ & జీ5. 

Also Read : 'ఓజీ'లో హీరోయిన్ ఈ అమ్మాయే - నాని, శర్వా తర్వాత పవన్ కళ్యాణ్ అంటే పెద్ద ఛాన్సే!

Published at : 20 Apr 2023 08:36 AM (IST) Tags: Anasuya bharadwaj Sangeeth Shobhan Zee5 OTT Prema Vimanam Movie Saanve Megghana

సంబంధిత కథనాలు

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్

Samantha Workout Video : షాక్ ఇచ్చిన సమంత - వందకు తగ్గేదే లే!

Samantha Workout Video : షాక్ ఇచ్చిన సమంత - వందకు తగ్గేదే లే!

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

టాప్ స్టోరీస్

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?