Ileana D'Cruz Pregnancy : బిడ్డకు తండ్రి ఎవరు? ఇలియానాపై దారుణమైన ట్రోల్స్
ఇప్పుడు ఇలియానా ప్రెగ్నెంట్! జీవితంలో సంతోషకరమైన విషయాన్ని అందరితో పంచుకోవాలని అనుకోవడమే ఆమె చేసిన తప్పు ఏమో! సోషల్ మీడియాలో కొందరు ఇలియానాను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇలియానాకు పెళ్లి అయ్యిందా? లేదా? ఆమె కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? అని సోషల్ మీడియాలో నిన్న అంతా చర్చ జరిగింది. ఎందుకు? అంటే... ప్రస్తుతం తాను గర్భవతి అని, త్వరలో తల్లిని కాబోతున్నానని ఇలియానా పోస్ట్ చేయడమే! తన జీవితంలో ఎంతో మధురమైన క్షణాల గురించి చెప్పడమే ఆమె చేసిన తప్పు ఏమో!? సమాజంలో మహిళలను, ముఖ్యంగా కథానాయికలను కొందరు ఏ విధమైన దృష్టితో చూస్తున్నారు? అనేది చెప్పడానికి ఇలియానాపై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఉదాహరణగా చూపించవచ్చు.
పెళ్లి కాకుండా బిడ్డకు జన్మ ఇస్తుందా?
తనకు పెళ్లి అయినట్లు ఇలియానా ఎప్పుడూ చెప్పలేదు. అందువల్ల, సహజంగా చాలా మందిలో ఇలియానాకు పెళ్లి అయ్యిందా? లేదా? అనే సందేహం కలిగింది. కొందరు అయితే ఓ అడుగు ముందుకు వేసి ఆ విషయంలో దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ''వావ్! పెళ్లి కాకుండా బిడ్డకు జన్మ ఇస్తుందా?'' అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. వ్యక్తిగత విషయాల్లో జోక్యం అనవసరమని కొందరు ఇలియానాకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇప్పుడు ఇలియానా వయసు 36 ఏళ్ళు. కథానాయికగా కొన్నేళ్లుగా సినిమాలు చేస్తూ వచ్చారు. బిడ్డను పెంచడానికి అవసరమైన ఆర్థిక స్థోమత ఆమె ఉన్నప్పుడు, ఒక చిన్నారి బాధ్యత తీసుకునేంత పరిణితి సాధించినప్పుడు... పెళ్లి కాకుండా బిడ్డకు జన్మ ఇవ్వకూడదా? అని ఇలియానాపై వస్తున్న విమర్శలకు సోషల్ మీడియాలో కొందరు సమాధానం ఇస్తున్నారు.
కరణ్ జోహార్ బిడ్డలకు తల్లి ఎవరో అడిగారా?
ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా కొన్నేళ్ల పాటు డేటింగులో ఉన్నారు. అతడితో బ్రేకప్ తర్వాత కొన్ని రోజులు ఒంటరిగా ఉన్నారు. ఆ తర్వాత కట్రీనా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ (Sebastian Laurent Michel)తో ప్రేమలో పడినట్లు ఉన్నారు. అయితే, ఆ విషయాన్నీ ఎక్కడా చెప్పలేదు. దాంతో 'నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు?' అని ఇలియానాను ప్రశ్నిస్తున్నారు. 'తండ్రి పాత్రలో ఎవరు నటిస్తారు?' అని కొందరు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇలియానాకు మద్దతుగా నిలుస్తున్న నెటిజనులు కూడా ఉన్నారు. ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్, నటుడు తుషార్ కపూర్ సరోగసీ పద్ధతి ద్వారా ఇద్దరు బిడ్డలకు తండ్రి అయిన సంగతి తెలిసిందే. వాళ్ళు తండ్రి అయిన విషయం చెప్పినప్పుడు ఆ బిడ్డలకు తల్లి ఎవరు? అని ఎవరైనా ప్రశ్నించారా? ఇప్పుడు ఇలియానా విషయంలో తండ్రి ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు.
తండ్రి ఎవరు? తండ్రి ఎవరు?
ఇది 2023, ఆ ప్రశ్న మానండి!
ఇలియానాకు సినిమా ప్రముఖులు చాలా మంది శుభాకాంక్షలు చెప్పారు. అయితే, సామాన్య ప్రేక్షకులు మాత్రం 'పెళ్లి ఎప్పుడు అయ్యింది? తండ్రి ఎవరు? ఎవరితో బిడ్డను కంటున్నావ్?' వంటి ప్రశ్నలు వేయడం ఆపడం లేదు. దాంతో ఓ నెటిజన్ 'ఇది 2023. అది తెలుసుకుని, ఇటువంటి ప్రశ్నలు వేయడం ఆపండి ' అని కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు పట్టించుకోవద్దని ఇలియానాకు కొందరు సలహా ఇచ్చారు.
Also Read : 'ఓజీ'లో హీరోయిన్ ఈ అమ్మాయే - నాని, శర్వా తర్వాత పవన్ కళ్యాణ్ అంటే పెద్ద ఛాన్సే!
సోషల్ మీడియా ద్వారా తమ జీవితంలో విషయాలను ప్రేక్షకులతో షేర్ చేస్తూ వాళ్ళకు అందుబాటులో ఉంటున్నారు సెలబ్రిటీలు. అదే సమయంలో కొంత మంది నుంచి ఇటువంటి ట్రోల్స్ తప్పడం లేదు. నీచమైన కామెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది. బహుశా... ఇటువంటి కామెంట్స్ తప్పించుకోవాలనే ఏమో బిడ్డ పుట్టే వరకు శ్రియా శరణ్ ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. గాయని చిన్మయి కూడాతాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చాలా రోజులు దాచారు. బిడ్డ పుట్టిన తర్వాత 'సరోగసీ ద్వారా కన్నారా?' అనే ప్రశ్న రావడంతో బేబీ బంప్ ఫోటోలు ఆమె షేర్ చేశారు.
Also Read : రవితేజ & శర్వానంద్ - ఓ మల్టీస్టారర్, ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్స్