News
News
వీడియోలు ఆటలు
X

Pawan Kalyan OG Heroine : 'ఓజీ'లో హీరోయిన్ ఈ అమ్మాయే - నాని, శర్వా తర్వాత పవన్ కళ్యాణ్ అంటే పెద్ద ఛాన్సే!

Priyanka Arul Mohan In Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ'లో కథానాయిక ఎవరనేది నేడు అనౌన్స్ చేశారు.  

FOLLOW US: 
Share:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న 'ఓజీ' ( ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ - They Call Him OG) సినిమాలో కథానాయిక ఎవరు? - ఈ ప్రశ్నకు చిత్ర బృందం అధికారికంగా సమాధానం ఇచ్చింది. పవన్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. 

పవన్‌ కళ్యాణ్‌ జోడీగా ప్రియాంక!
తెలుగులో నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ నటించారు. ఆ తర్వాత శర్వానంద్ 'శ్రీకారం'లోనూ నటించారు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశాన్ని అందుకున్నారు. కథానాయికగా ఆమెకు ఇది పెద్ద ఛాన్స్ అని చెప్పాలి.

తెలుగులో రెండు సినిమాలు చేశాక... తమిళంలో ప్రియాంకకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. శివ కార్తికేయన్ జోడీగా నటించిన 'డాక్టర్', 'డాన్' చిత్రాతో విజయాలు అందుకున్నారు. మధ్యలో సూర్యతో 'ఈటీ' సినిమా కూడా చేశారు. ప్రస్తుతం ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' సినిమా చేస్తున్నారు.  

పవర్ స్టార్ అభిమాని, 'సాహో' ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య 'ఓజీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. ప్రజెంట్ షెడ్యూల్ లో ప్రియాంకా అరుల్ మోహన్ కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు పవన్, ప్రియాంక మీద కీలక సన్నివేశాలను తీసే పనిలో సుజీత్ బిజీగా ఉన్నారు.

Also Read : రవితేజ & శర్వానంద్ - ఓ మల్టీస్టారర్, ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్స్

పదహారో క్లైమాక్స్ ఓకే చేసిన సుజీత్!
షూటింగ్ మొదలైన సందర్భంగా విడుదల చేసిన వీడియోలో క్లైమాక్స్ గురించి సుజీత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నోటితో నేరుగా ఏదీ చెప్పలేదు. కానీ, వీడియో మీద ఓ లుక్ వేస్తే... క్లైమాక్స్ కోసం చాలా డ్రాఫ్ట్స్ రాసినట్టు ఈజీగా అర్థమైంది. 'క్లైమాక్స్ 15' అని రాసి, చివరకు దాన్ని చెత్తబుట్టలో పడేశారు. అంటే... 15 సార్లు క్లైమాక్స్ చేంజ్ చేశారన్నమాట. చివరకు, 16వ క్లైమాక్స్ ఓకే చేసినట్టు తెలుస్తోంది.

వీడియో ప్రారంభంలో ఓ సీన్ పేపర్ వస్తుంది. ఒక ప్రయివేట్ పోర్టులో, ఒక పెద్ద ఐరన్ గేటు ముందు, పోర్టులో ఎంటర్ అయ్యే దారిలో వందల మంది గన్నులతో నిలబడతారు. అందులో ఇద్దరి పేర్లు డంగి, ఫైజల్! ఇక్కడికి రావాలని అనుకుంటే వాడి కంటే మూర్ఖుడు ఉండదని డంగి అంటాడు. బుల్లెట్ సౌండ్ వినిపించడంతో డంగి, ఫైజల్... ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. వాళ్ళ ముందు ఓ స్మోక్ బాంబ్ పడుతుంది. ఆ పొగ లోంచి ఓ మనిషి రూపం కనబడుతుంది. నల్ల మబ్బులు కమ్మిన ఆకాశం లోనుంచి ఓ మెరుపు వచ్చినట్లు వస్తాడు. ఇదీ సీన్! ముంబైలో హీరో ఇంట్రడక్షన్ అనుకుంట! ఇది పవర్ స్టార్ అభిమానులకు కిక్ ఇచ్చేలా ఉంది.

Also Read న్యాయ 'వ్యవస్థ'లో రైట్ రాంగ్ ఏమీ ఉండదు - హెబ్బాతో కార్తీక్ రత్నం, కామ్నా

వీడియోలో వినిపించిన తమన్ సంగీతం సైతం సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే అంశాలు అన్నీ సినిమాలో ఉన్నట్టు అర్థం అవుతోంది. ముఖ్యంగా సుజీత్ ఈ వీడియోను తీసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. బాల్ బాంబ్ కావడం, పెన్సిల్స్ బుల్లెట్స్ అవ్వడం, స్కేల్ జపనీస్ స్వార్డ్ కింద మారడం చూస్తుంటే... సినిమాలో ఎన్ని ఫైట్స్ ఉన్నాయనేది, పవన్ కళ్యాణ్ ఎన్ని వెపన్స్ వాడతారనేది ఈజీగా అర్థం అవుతోంది.  

Published at : 19 Apr 2023 11:14 AM (IST) Tags: Pawan Kalyan Priyanka Mohan sujeeth they call him og OG Movie Priyanka Pawan Pair

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

BGMI Tips: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

BGMI Tips: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!