అన్వేషించండి

Anasuya Bharadwaj : శివాజీ వర్సెస్ అనసూయ కోల్డ్ వార్ - ఇది నెటిజన్లు సృష్టించిన కాంట్రవర్సీనా?

Anasuya Bharadwaj Reaction : యాంకర్ అనసూయ శివాజీ పేరిట మరో సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా చీరకట్టులో గుడికి వెళ్లగా దాన్ని షేర్ చేస్తూ నెటిజన్లు చేసి పోస్టుకు వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు.

Anchor Anasuya Satirical Tweet On Actor Sivaji : అప్పుడెప్పుడో దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు శివాజీ మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అటు, సోషల్ మీడియా ఇటు ఇండస్ట్రీలో ఈ కాంట్రవర్సీ కొద్ది రోజుల పాటు సాగింది. మహిళా కమిషన్ ముందు... ఆ తర్వాత ప్రెస్ మీట్స్ పెట్టి మరీ శివాజీ తన కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు.

కొద్ది రోజులకు ఈ వివాదం సద్దుమణిగినట్లే కనిపించింది. అయితే, మళ్లీ అనసూయ సెటైరికల్ ట్వీట్‌తో ఈ కాంట్రవర్సీ మళ్లీ తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది.

అసలేం జరిగిందంటే?

శివాజీ కామెంట్స్ తర్వాత చాలా ఈవెంట్స్‌లో మహిళలు చీర కట్టులో కనిపిస్తుండగా... ఇది ఆయన కామెంట్స్ ఎఫెక్టే అంటూ చాాలామంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. తాజాగా, యాంకర్ అనసూయ కూడా చీర కట్టుకుని తన ఫ్యామిలీతో కలిసి గుడికి వెళ్లారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ... శివాజీ దెబ్బకు చీర కట్టుకుని తిరుగుతున్న అనసూయ అంటూ సెటైరికల్‌గా పోస్ట్ చేశారు. దీనిపై ఆమె కూడా తనదైన స్టైల్‌లో వ్యంగ్యంగానే కౌంటర్ ఇచ్చారు.

శివాజీ సృష్టించిన చీర...

థంబ్ నైల్ అలా కాదు ఇలా ఉండాలంటూ సలహా ఇచ్చారు అనసూయ. 'శివాజీ సృష్టించిన చీర ధరించి తిరుగుతున్న అనసూయ అంటూ థంబ్‌నైల్ పెడతారనుకున్నా. సరైన హెడ్ లైన్ ఇదే కదా... ఎందుకంటే గతంలో మేము ఎప్పుడూ చీరల కట్టుకోలేదు. ఏమైనా పోస్ట్ చేసే ముందు చూసుకోవాలి కదా...' అంటూ కౌంటర్ ఇచ్చారు. నిజానికి ఆమె చాలా ఈవెంట్లలో ఆమె చీర కట్టుకుని కనిపించారు. పలు ఫోటో షూట్లనూ చీరతోనే చేశారు. ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా... నెటిజన్లు కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Also Read : కొరియన్ కనకరాజు కంసామీద సాంగ్ - కొరియన్ లాంగ్వేజ్ విత్ క్యూట్ లవ్ లిరిక్స్

శివాజీ రియాక్ట్ అవుతారా?

మరి అనసూయ తాజా పోస్టుపై శివాజీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. నిజానికి ఈ వివాదం ఎప్పుడో సద్దుమణిగిందనే అంతా అనుకున్నారు. తాను ఆ రెండు పదాలు మాట్లాడకుండా ఉండాల్సింది అంటూ గతంలోనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు శివాజీ. అనసూయను కూడా తాను ఏమీ అనలేదని... ఆ అమ్మాయి అంటే తనకు గౌరవం ఉందని చెప్పారు. తన ఉద్దేశం ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారని... తనకు తెలిసిన వారే కమిషన్‌కు కంప్లైంట్ చేసినట్లు వెల్లడించారు.

అయితే, కోల్డ్ వార్ లాంటిది ఏమీ లేదని... ఇది కొందరు సోషల్ మీడియాలో కావాలని సృష్టిస్తున్న వార్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి కాంట్రవర్సీ లేకున్నా వీడియోలు పోస్ట్ చేసి కామెంట్స్ చేయడం... పాత వాటిని గుర్తు చేస్తూ లేని పోని వివాదాలు సృష్టిస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget