అన్వేషించండి

Singer Mangli Case : మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - ఆ ప్రచారం బాధాకరం... డైరెక్టర్ వేణు రియాక్షన్

Venu Udugula Reaction : సింగర్ మంగ్లీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని డైరెక్టర్ వేణు ఊడుగుల చెప్పారు. ఎఫ్ఐఆర్‌లో తన పేరును ఎక్కడా మెన్షన్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

Director Venu Udugula Clarification On Recent Allegations : సింగర్ మంగ్లీపై కేసు అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్టర్ వేణు ఊడుగులపై కూడా కేసు నమోదైందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన తాజాగా స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టారు.

'నాకు ఎలాంటి సంబంధం లేదు'

'మంగ్లీ కేసుతో లింక్ చేస్తూ నా పేరుపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి బాధపడ్డా. ఆ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మంగ్లీ, ఆమెపై కంప్లైంట్ చేసిన లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు పరిచయం ఉన్న వ్యక్తులు కావడంతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడమని మాత్రమే సూచించా. అంతకు మించి ఇందులో ఎలాంటి పాత్ర పోషించలేదు.

మరో విషయం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఈ కేసుకు సంబంధించి కూడా నా పేరు నిందితుడిగా ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే, ఈ కేసు పెట్టిన సుబ్బారావు మీడియా ముందు మాట్లాడుతూ... నాకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. నిజానిజాలు తెలుసుకోకుండానే నా పేరును ఈ వ్యవహారంతో కలిపి ప్రచారం చేయడం బాధాకరం. పోలీసులు కూడా నాకు ఏం సంబంధం లేదనే చెప్పారు. ఓ వ్యక్తి కుటుంబ పరువు, మర్యాద... ఇలాంటి వార్తల వల్ల ఎఫెక్ట్ అవుతాయనే విషయాన్ని గుర్తించుకోవాలి అని నా రిక్వెస్ట్.' అంటూ రాసుకొచ్చారు.

Also Read : పాపం హరీష్ శంకర్... ఉస్తాద్ భగత్ సింగ్ కోసమేమో అనుకున్నా... డైరెక్టర్ రియాక్షన్ వైరల్

ఒకరిపై ఒకరు కంప్లైంట్స్

ముందుగా లాయర్ సుబ్బారావు సింగర్ మంగ్లీపై కంప్లైంట్ చేయగా... మంగ్లీ సహా ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్ల మేర ఆమె మోసం చేశారని కొందరు తనకు చెప్పగా... ఈ విషయం తెలుసుకునేందుకు మంగ్లీని సంప్రదిస్తే తనను అవమానకరంగా మాట్లాడారని లాయర్ తెలిపారు. డబ్బులు ఆఫర్ చేశారని.... అందుకు అంగీకరించకుంటే బెదిరింపులకు పాల్పడ్డారని సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరోవైపు, సింగర్ మంగ్లీ సైతం లాయర్ సుబ్బారావుపై నార్సింగి పీఎస్‌లో కంప్లైంట్ చేశారు. తమతో లాయర్ అమర్యాదగా మాట్లాడారని... తనను కలవాలని ఒత్తిడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించారని... ఆయన తీరుతో తన ఫ్యామిలీ మెంబర్స్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు తెలిపారు. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

ఈ క్రమంలో లాయర్ కంప్లైంట్‌లో డైరెక్టర్ వేణు ఊడుగుల పేరు కూడా ఉన్నట్లు ప్రచారం సాగింది. దీనిపైనే ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
Allu Arjun: వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
Rao Bahadur OTT: రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget