రాకాస ప్రీ రిలీజ్ బిజినెస్... సంగీత్ శోభన్ ముందున్న టార్గెట్ ఎంతంటే?
Published by: Satya Pulagam
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'రాకాస' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వేల్యూ 12.50 కోట్లు.
కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ ద్వారా నిర్మాత నిహారిక కొణిదెలకు రూ. 1.25 కోట్లు వచ్చాయి.
'రాకాస' ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ. 2.25 కోట్లకు అమ్మారు.
'రాకాస' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 16 కోట్లు.
ఇప్పుడు సంతోష్ శోభన్ ముందున్న టార్గెట్... 18 కోట్ల షేర్. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. అంత రావాలి అంటే కనీసం 30 కోట్లకు పైగా గ్రాస్ రావాల్సిన అవసరం ఉంది.
ఓటీటీ రైట్స్ ద్వారా 'రాకాస'కు మంచి అమౌంట్ వచ్చింది. సినిమాను 10 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం.
ఆడియో రైట్స్ ద్వారా 'రాకాస' నిర్మాతలకు కోటి రూపాయలు వచ్చినట్టు తెలిసింది. సో... నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 11 కోట్లు వచ్చింది.
'రాకాస' హిందీ డబ్బింగ్, శాటిలైట్ డీల్ ఇంకా క్లోజ్ కాలేదు. ఆ రెండిటి ద్వారా కొంత అమౌంట్ వస్తుంది.
'రాకాస' థియేట్రికల్ రైట్స్ 18 కోట్లు, నాన్ థియేట్రికల్ రైట్స్ 11 కోట్లు... టోటల్ 29 కోట్ల బిజినెస్ జరిగింది. మిగతా రైట్స్ ద్వారా కోటి వచ్చే అవకాశం ఉందట.