అన్వేషించండి

Harish Shankar : పాపం హరీష్ శంకర్... ఉస్తాద్ భగత్ సింగ్ కోసమేమో అనుకున్నా... డైరెక్టర్ రియాక్షన్ వైరల్

Ustaad Bhagat Singh : పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్‌పై డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పాపం ప్రతాప్ ఈవెంట్‌లో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Director Harish Shankar Reaction About Ustaad Bhagat Singh Result : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రీసెంట్‌గా వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోయింది. అయితే, హరీష్ శంకర్ మాత్రం సోషల్ మీడియాలో విమర్శలను పట్టించుకోలేదు.

మూవీని అందరూ ప్రశంసిస్తున్నారంటూ రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆడియన్స్ నుంచి వస్తున్న నెగిటివ్ ఫీడ్ బ్యాక్‌ను కూడా ఆయన అంగీకరించడం లేదంటూ ట్రోలింగ్ సాగింది. తాజాగా, తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ ఈవెంట్‌కు హాజరైన హరీశ్ శంకర్... ఉస్తాద్ రిజల్ట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సరదాగా కామెంట్ చేస్తూనే...

పాపం ప్రతాప్ టైటిల్ ప్రకారం... యాంకర్ స్రవంతి గెస్ట్‌ల పేరు ముందు పాపం అని యాడ్ చేసి స్టేజ్ మీదకు పిలిచారు. ఈ సందర్భంగా హరీష్‌ను సైతం అలాగే పిలిచారు. దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు. 'ఇక్కడకు రాగానే స్రవంతి గారు పాపం హరీష్ అని పిలిచారు. మొన్న సినిమా (ఉస్తాద్ భగత్ సింగ్) అనుకున్నంత ఆడలేదు కదా. అందుకే పాపం అన్నారేమో అనుకున్నా. తర్వాత వచ్చిన అందరికీ అనేశారు. అందుకే ఓకే మనది కాదులే అనుకున్నా. ప్రమోషన్లలో భాగం అని అర్థం చేసుకున్నా.' అంటూ కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఎట్టకేలకు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితాన్ని అంగీకరించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషన్ల కంటే కంటెంట్‌పై ఫోకస్ చేయాలంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. 

Also Read : చిరు, బాబీ మూవీ మెగా 158 లాంచ్‌కు బ్రేక్! - జన నాయగన్ ఎఫెక్ట్... నిర్మాతలు మారతారా?

ఉస్తాద్ విమర్శలకు కౌంటర్

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియా వేదికగా వచ్చిన విమర్శలపై డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కౌంటరిచ్చారు. 'పవన్ కల్యాణ్ గారి స్వాగ్, డైలాగ్ డెలివరీ ఎలా చూపించాలని అనుకున్నానో అలాగే చూపించా. ఒకవేళ నా నుంచి ఎవరైనా అద్భుతమైన కళాఖండం ఎక్స్ పెక్ట్ చేసుంటే సారీ.' అంటూ కామెంట్ చేశారు. దీనిపై ఫ్యాన్స్ దగ్గర నుంచీ నెట్టింట ట్రోలింగ్ సాగింది. ఫైనల్‌గా పాపం ప్రతాప్ ఈవెంట్‌లో ఆయన కామెంట్స్‌తో నిజం ఒప్పుకొన్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి.

'19 సినిమాలు క్యాన్సిల్'

తన కెరీర్‌లో చేసింది 9 సినిమాలైతే... క్యాన్సిలైంది 19 చిత్రాలని చెప్పారు హరీష్ శంకర్. 'పాపం ప్రతాప్ మూవీ దుర్గా నరేశ్ ఎంతో కష్టపడి తీశారు. గతంలో ఆయన చేయాలనుకున్న చాలా సినిమాలు క్యాన్సిల్ అయ్యాయని తెలిసింది. నరేశ్... మీకో విషయం చెబుతున్నా. నేను చేసింది కేవలం 9 సినిమాలైతే... క్యాన్సిలైంది 19 సినిమాలు.

ప్రెస్ మీట్స్ పెట్టి హీరోలు ఓకే చేసి, ఎల్లుండి ముహూర్తం అనగా ఈ రోజు కూడా క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడకు వచ్చింది పని చేయడానికి మాత్రమే. నచ్చిన పని చేస్తే మనం సక్సెస్ అయినట్లే. ఆడియన్స్‌కు నచ్చితే అది బోనస్ అవుతుంది' అని అన్నారు.

యంగ్ హీరో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన పాపం ప్రతాప్ మూవీకి దుర్గా నరేష్ దర్శకత్వం వహించారు. ఈ నెల 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget