అన్వేషించండి

Singer Mangli : లాయర్‌పై సింగర్ మంగ్లీ కంప్లైంట్ - బెదిరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ...

Singer Mangli Reaction : తనపై ఆరోపణలు చేసిన లాయర్‌పై సింగర్ మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరిస్తున్నారని... తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

Singer Mangli Reacted Files Complaint Against Lawyer : మైక్రో ఫైనాన్స్ పేరిట కోట్లలో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై సింగర్ మంగ్లీ రియాక్ట్ అయ్యారు. తనపై ఆరోపణలు చేసిన న్యాయవాదిపై ఆమె నార్సింగి పోలీసులకు తాజాగా కంప్లైంట్ చేశారు. రూ.150 కోట్ల మేర మోసం చేశారంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 21న సుభా సియపోగు పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి తనను బెదిరించాడని వెల్లడించారు.

మంగ్లీ ఏం చెప్పారంటే?

లాయర్ సుబ్బారావు అమర్యాదగా బెదిరించే ధోరణిలో మట్లాడారని... తనను కలవాలని ఒత్తిడి చేసినట్లు కంప్లైంట్‌లో పేర్కొన్నారు మంగ్లీ. 'ఒకవేళ నిరాకరిస్తే అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించారు. మరో వ్యక్తితో కలిసి అవమానకరంగా మాట్లాడారు. నాకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారు. లాయర్ తీరుతో నా ఫ్యామిలీ మెంబర్స్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు.' అని తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Also Read : చిరు, బాబీ మూవీ మెగా 158 లాంచ్‌కు బ్రేక్! - జన నాయగన్ ఎఫెక్ట్... నిర్మాతలు మారతారా?

అసలేం జరిగిందంటే?

సికింద్రాబాద్‌కు చెందిన లాయర్ సుబ్బారావును రీసెంట్‌గా కొందరు కలిసి మైక్రో ఫైనాన్స్ పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి గాయని మంగ్లీ, ఆమె సోదరుడు సహా మరికొంతమంది తమను రూ.10 కోట్ల మేర మోసగించారని తెలిపారు. ఈ డబ్బును ఎక్స్ పోర్ట్ ఇంపోర్ట్, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు చెప్పారు. దాదాపు 150 మంది నుంచి డబ్బులు సేకరించి తర్వాత పరారైనట్లు లాయర్‌కు వివరించారు.

దీంతో ఈ విషయం తెలుసుకునేందుకు లాయర్ సింగర్ మంగ్లీని సంప్రదించగా... ఆమె తనతో అవమానకరంగా మాట్లాడారని, తన వృత్తిని కించ పర్చారని ఆరోపించారు. కేసు వెనక్కి తీసుకునేందుకు డబ్బులు కూడా ఆఫర్ చేసినట్లు తెలిపారు. ఇందుకు తాను అంగీకరించక పోవడంతో బెదిరింపులకు పాల్పడినట్లు... పంజాగుట్ట  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సింగర్ మంగ్లీ సహా, ఆమె సోదరుడు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో డైరెక్టర్ వేణు ఊడుగుల పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా సింగర్ మంగ్లీ సదరు లాయర్‌పై కంప్లైంట్ చేశారు. పోలీసులు రెండు ఫిర్యాదులపైనా విచారిస్తున్నారు.

గాయని మంగ్లీ ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రీసెంట్‌గా ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ వివాదానికి దారి తీయగా.. దానిపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ పేరిట మోసం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. గతంలోనూ ఈ ఆరోపణలు రాగా ఆమె తీవ్రంగా ఖండించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Cases: కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు! రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ అటాక్! 
కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు! రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ అటాక్! 
Hyderabad Crime News: గూగుల్ వెతికి మరీ గొంతుకోశారు! చింతల్‌లో సంచలనంగా మారిన మర్డర్!
గూగుల్ వెతికి మరీ గొంతుకోశారు! చింతల్‌లో సంచలనంగా మారిన మర్డర్!
Women Safety In Hyderabad: వస్తావా.. నీ రేటెంత..? హైదరాబాద్ లో ఆకతాయిల బారినపడ్డ లేడీ ఐపీఎస్ ! వివాదంగా మారిన ఆపరేషన్
వస్తావా.. నీ రేటెంత..? హైదరాబాద్ లో ఆకతాయిల బారినపడ్డ లేడీ ఐపీఎస్ ! వివాదంగా మారిన ఆపరేషన్
KTR on Farmers Death: మంచిర్యాలలో నలుగురు రైతులవి ప్రభుత్వ హత్యలే.. 25 లక్షల పరిహారం ఇవ్వాలి- కేటీఆర్ డిమాండ్
మంచిర్యాలలో నలుగురు రైతులవి ప్రభుత్వ హత్యలే.. 25 లక్షల పరిహారం ఇవ్వాలి- కేటీఆర్ డిమాండ్
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK MLA Vijay Damu : ఆటోడ్రైవర్ పేరుతో ప్రచారం చేసుకుని ఎమ్మెల్యేగా గెలిచాడు - కానీ కోటీశ్వరుడు - టీవీకే ఎమ్మెల్యేపై విమర్శలు
ఆటోడ్రైవర్ పేరుతో ప్రచారం చేసుకుని ఎమ్మెల్యేగా గెలిచాడు - కానీ కోటీశ్వరుడు - టీవీకే ఎమ్మెల్యేపై విమర్శలు
Kartavya Trailer : ఓటీటీలోకి నేరుగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కర్తవ్య - దేవర విలన్ కొత్త మూవీ ట్రైలర్ చూశారా?
ఓటీటీలోకి నేరుగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కర్తవ్య - దేవర విలన్ కొత్త మూవీ ట్రైలర్ చూశారా?
Bengal new CM: బెంగాల్ సీఎంగా మహిళా నేత - మోదీ, షా మరోసారి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా?
బెంగాల్ సీఎంగా మహిళా నేత - మోదీ, షా మరోసారి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా?
Chandrababu Collectors Meet: ఫైళ్లలో కాదు.. క్షేత్రస్థాయిలో మార్పు రావాలి - కలెక్టర్లకు సీఎం చంద్రబాబు మిషన్-2029 టార్గెట్
ఫైళ్లలో కాదు.. క్షేత్రస్థాయిలో మార్పు రావాలి - కలెక్టర్లకు సీఎం చంద్రబాబు మిషన్-2029 టార్గెట్
Thalapathy Vijay : ట్రెండింగ్‌లో విజయ్ టెన్త్ మార్క్ షీట్ - దళపతికి ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా!
ట్రెండింగ్‌లో విజయ్ టెన్త్ మార్క్ షీట్ - దళపతికి ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా!
NHAI Issues Warning: నేషనల్ హైవేలపై కొత్త టోల్ రూల్స్.. గడువు దాటితే డబుల్ పేమెంట్! హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్
నేషనల్ హైవేలపై కొత్త టోల్ రూల్స్.. గడువు దాటితే డబుల్ పేమెంట్! హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్
Chinese Cars India:భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో చైనా కార్ల సునామీ! విప్లవాత్మక టెక్నాలజీ, అందుబాటు ధరల్లో వస్తున్న సరికొత్త మోడళ్లు! 
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో చైనా కార్ల సునామీ! విప్లవాత్మక టెక్నాలజీ, అందుబాటు ధరల్లో వస్తున్న సరికొత్త మోడళ్లు! 
Tamil Nadu Politics: ఇవాళ కాకపోతే రేపైనా విజయ్‌కు గవర్నర్ చాన్సివ్వాల్సిందే - రాజ్యాంగ రూల్స్ ఇవే!
ఇవాళ కాకపోతే రేపైనా విజయ్‌కు గవర్నర్ చాన్సివ్వాల్సిందే - రాజ్యాంగ రూల్స్ ఇవే!
Embed widget