అన్వేషించండి

Anand Deverakonda: నాని అన్న చెప్పింది నిజమైంది - అప్పుడు మా అన్నయ్య, ఇప్పుడు నేను - ఆనందర్‌ దేవరకొండ ఎమోషనల్‌

Anand Deverakonda Emotional: హీరో ఆనందర్‌ దేవరకొండ ఎమోషనల్‌ అయ్యాడు. నిన్న దుబాయ్‌లో జరిగిన సైమా అవార్ట్స్ వేడుకలో బేబీ చిత్రానికి గానూ అతడు అవార్డు అందుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ...

ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా అవార్ట్స్‌లో నాని దసరా, హాయ్‌ నాన్న చిత్రాలు సత్తా చాటాయి. తెలుగు, కన్నడ చిత్రాలకు ఇచ్చిన ఈ అవార్డు వేడుకలో మన తెలుగు సినిమాలకు అవార్డుల పంట పండింది. దసరా, హాయ్‌ నాన్న చిత్రాలతో పాటు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి, బేబీ చిత్రాల జంటలు అవార్డులు అందుకున్నారు. ఇక బేబీ సినిమాకు గానూ యాక్టర్ క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నాడు ఆనంద్‌ దేవరకొండ. ఈ సినిమాతో భగ్న ప్రేమికుడిగా తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ని కట్టిపడేశాడు.

సైమా అవార్ట్స్ 2024

ఇందులో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆనంద్‌గా ప్రియురాలి చేతిలో మోసపోయిన ప్రేమికుడిగా ఆనంద్‌ దేవకొండ అద్భుతమైన నటన కనబరిచాడు. బేబీ అతడి హార్ట్ టచింగ్ పర్ ఫార్మెన్స్‌కు గానూ ఈ ఏడాది  సైమా అవార్డ్ సొంతమైంది. హీరో రానా చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ఆనందం వ్యక్తం చేశాడు. అవార్డు అందుకున్న అనంతరం అతడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ అవార్డు వేడుకలు ఆనంద్‌ తన అన్నయ్య హీరో విజయ్‌ దేవరకొండతో కలిసి హాజరయ్యాడు. 

ఆ మాటలు నిజమయ్యాయి

ఈ మేరకు ఆనంద్‌ దేవరకొండ స్టేజ్‌పై మాట్లాడుతూ.. "నాని ఒకసారి నాకు ఓ మాట  చెప్పాడు. మనిషి లైఫ్‌ ఎప్పుడు ఒక ఫుల్‌ సర్కిల్లా వస్తుందన్నాడు. ఇప్పుడు ఆ మాటలు నిజం అవుతున్నాయి. మా అన్నయ్య(విజయ్‌ దేవరకొండ) తన ఫస్ట్‌ సైమా అవార్డును రానా అన్న చేతులు మీదుగా తీసుకున్నాడు. ఇప్పుడు నేను కూడా నా ఫస్ట్‌ సైమా అవార్డు ఆయన చేతుల మీదుగా తీసుకున్నాను. బేబీ సినిమా మా టీంకు లైఫ్‌ ఇచ్చింది. SKN అన్నతో సహా మా టీమ్ అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్యూ చెబుతున్నాను. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు మీ అన్న విజయ్‌ని చూసే వచ్చావ్ కదా అని అడిగేవారు. అది కొంతవరకు నిజమే. అయితే పూర్తి సమాధానం నాకు దొరకలేదు.

వారికి ఈ అవార్డు సమాధానం...

ఇప్పుడు వాటన్నింటికి సైమా అవార్డ్ జవాబు ఇస్తుందని అనుకుంటున్నా. దుబాయ్ మాల్‌లో ఓ కేరళ అబ్బాయి కలిశాడు. నన్ను గుర్తుపట్టి ఇలా అన్నాడు. "మీ 'బేబి' సినిమా నాకు చాలా ఇష్టం. అలాంటి మంచి సినిమా చేసినందుకు థ్యాంక్యూ" చెప్పాడు. సినిమాను ప్రేమించే అలాంటి ప్రేక్షకులు ఉన్నంతవరకు నేను నటిస్తూనే ఉంటా" అంటూ అతడు ఎమోషనల్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆనంద్‌ దేవరకొండ కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. దొరసాని మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు ఆనంద్‌ దేవరకొండ. ఫస్ట్‌ మూవీతోనే తన యాక్టింగ్‌ స్కిల్స్‌తో హీరోగా ప్రూవ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత మిడిల్‌ క్లాస్‌ మెలోడిస్‌, పుష్పక విమానం, హైవే వంటి చిత్రాల్లో నటించిన అవి ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు. కానీ, 2023లో నటించిన ఈ బేబీ చిత్రంతో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. తన కెరీర్‌లో బేబీ ఒక మైల్‌స్టోన్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. 

Also Read: పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ - హాజరైన సీఎం స్టాలిన్, ఫోటోలు వైరల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget