Allu Arjun: వంద కోట్లకు రూపాయి 'తగ్గేదే లే' అంటున్న అల్లు అర్జున్?
రెమ్యూనరేషన్ విషయంలో అల్లు అర్జున్ 'తగ్గేదే లే' అంటున్నారా? తన తర్వాత సినిమాకు ఆయన వంద కోట్లు డిమాండ్ చేస్తున్నారా?... ఫిల్మ్ నగర్‌లో కొత్త కబురు చక్కర్లు కొడుతోంది.
Allu Ajun Remuneration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు ఎంత తీసుకున్నారో తెలియదు గానీ ఇక నుంచి ప్రతి సినిమాకు సెంచరీ కొడతారని ఫిల్మ్ నగర్ ఖబర్. ఇప్పుడు అల్లు అర్జున్ పారితోషికం వంద కోట్లకు చేరిందని సమాచారం.
'పుష్ప : ది రైజ్'తో ఆయన హిందీలోనూ భారీ హిట్ అందుకున్నారు. ఎప్పటి నుంచో మలయాళంలో అక్కడి స్టార్ హీరోలతో సమానంగా ఆయనకు మార్కెట్ ఉంది. అందువల్ల, అల్లు అర్జున్‌తో సినిమా చేస్తే... డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో ఎలా లేదన్నా వంద కోట్లు రావడం ఖాయం. బాక్సాఫీస్ వసూళ్ళు ఉంటాయి కదా! అందుకని, బన్నీ పారితోషికం కూడా పెరిగిందట.
'పుష్ప : ది రూల్' (Pushpa : The Rule) కోసం అల్లు అర్జున్ వంద కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. హిందీ మార్కెట్ చూపించి అంత కోట్ చేస్తున్నారట. మరోవైపు దర్శకుడు సుకుమార్ పారితోషికం రూ. 50 కోట్లు అని వినికిడి. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరి పారితోషికాలు డిసైడ్ చేసి... ఆ తర్వాత బడ్జెట్ లెక్కలు వేయాలని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు భావిస్తున్నారట.
Also Read: పవన్ సినిమాలో డైలాగ్ లీక్ చేయించిన చిరంజీవి, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే
వేసవి తర్వాత 'పుష్ప' పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ కావచ్చని టాక్. ఆల్రెడీ తొలి భాగంలో కనిపించిన ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు రెండో భాగంలో కూడా కనిపిస్తారు. కొత్త క్యారెక్టర్స్ కోసం రెండో పార్టుకు హిందీ నుంచి కొంత మంది నటీనటులను తీసుకునే ఆలోచనలో సుకుమార్ ఉన్నారట.
Also Read: 'నీ షర్ట్ బటన్స్ తీసేయ్' - అషుపై శివ చేసిన వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.