News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Allu Arjun: ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్ - డిఫరెంట్ లుక్‌తో పుష్పరాజ్ సర్ ప్రైజ్

అల్లు అర్జున్ ‘పుష్ప2‘ షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. మరోవైపు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

FOLLOW US: 
Share:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప2‘. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని, దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పుష్ప’ మూవీ దుమ్మురేపింది. ఈ చిత్రంలో అద్భుత నటన కనబర్చిన అల్లు అర్జున్, ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపిక అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ హీరోకు దక్కని గౌరవం ఆయనకు దక్కింది.  ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్‌లో మునిగిపోయారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన ‘పుష్ప2’ను తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ సుకుమార్ . 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో,  దాన్ని తలదన్నేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంతో ‘పుష్ప2’పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

ఫ్లిప్‌ కార్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్

ఓవైపు ‘పుష్ప2’ షూటింగ్ లో బిజీగా గడుపుతూనే, మరోవైపు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ ఫారమ్ ఫ్లిప్‌ కార్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించబోతున్నారు. త్వరలో ఫ్లిప్‌ కార్ట్ మెగా సేల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా ఓ యాడ్ షూటింగ్ లోనూ పాల్గొన్నారు. ఈ మధ్యే ఈ యాడ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. తాజా యాడ్ లో ఆయన సరికొత్త లుక్ లో అందరినీ సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాడ్ ప్రధానంగా మెగా సేల్ చుట్టూ తిరగనుంది.

'పుష్ప- ది రూల్' విడుదల ఎప్పుడంటే?

'పుష్ప- ది రూల్' సినిమా విడుదల తేదీపై మేకర్స్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది(2024) మార్చి 22న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 75 శాతం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.   ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అవుతుందట. దీంతో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప 2’ మూవీని  మైత్రీ మూవీ మేకర్స్,  సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు చేయనున్నారు. అటు అట్లీ సినిమాకు సైతం బన్నీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 

Read Also: విలాసవంతమైన బంగళా, లగ్జరీ కార్లు - పరిణీతి చోప్రా ఆస్తుల విలువెంతో తెలుసా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 25 Sep 2023 01:50 PM (IST) Tags: Allu Arjun Pushpa 2 Flipkart Allu Arjun Flipkart Add

ఇవి కూడా చూడండి

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు