అన్వేషించండి

Parineeti Chopra Net Worth: విలాసవంతమైన బంగళా, లగ్జరీ కార్లు - పరిణీతి చోప్రా ఆస్తుల విలువెంతో తెలుసా?

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ రాఘవ చద్దా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ వేదికగా అట్టహాసంగా వీరి పెళ్లి జరిగింది ఇంతకీ పరిణీతి చోప్రా ఆస్తుల విలువెంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బాలీవుడ్‌ హీరోయిన్ పరిణీతి చోప్రా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆప్‌ ఎంపీ రాఘవ చద్దాతో మెడలో మూడు ముళ్లు వేయించుకుంది.  సెప్టెంబరు 24 రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సుమారు 200 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు. 50 మందికిపైగా వీఐపీలు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. పరిణీతి పెళ్లి నేపథ్యంలో ఆమె ఆస్తులు, అంతస్తుల గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె నెట్ వర్త్ ఏంతో ఇప్పుడు తెలుసుకుందాం..

ముంబైలో లగ్జరీ సీ ఫేస్ అపార్ట్ మెంట్

పరిణీతి చోప్రా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కలిగి ఉంది.  ఇన్‌స్టాగ్రామ్‌లో 42 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈమె తరచుగా తన విలాసవంతమైన జీవితానికి సంబంధించి ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. పరిణీతికి ముంబైలో సముద్రానికి ఎదురుగా ఓ అపార్ట్ మెంట్ ఉన్నది. ఈ ఇంట్లో నుంచి సముద్రపు అందాలను తిలకిస్తూ తరుచుగా కనిపిస్తుంది పరిణీతి. ఆమె ఇంటి విలువ రూ. 22 కోట్లుగా ఉంటుందని సమాచారం.

విలాసవంతమైన కార్ కలెక్షన్

పరిణీతి చోప్రా దగ్గర పలు లగ్జరీకార్లు ఉన్నాయి. ఆడి A6, జాగ్వార్ XJL, ఆడి Q5 సహా పలు హై-ఎండ్ బ్రాండ్‌లను కలిగి ఉంది. ఇక ఆమె పలు ఎండార్స్ మెంట్స్ ను కలిగి ఉంది. సినిమాలు చేయడంతో పాటు లక్స్, వాడిలాల్, నివియా, క్లోత్స్ బ్రాండ్ లైరా, మెడిమిక్స్, బ్యూటీ బ్రాండ్ అవాన్, బోరో ప్లస్, కుర్ కురే వంటి బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తుంది. మొత్తంగా ఆమె నికర ఆస్తుల విలువ సుమారు రూ. 60 కోట్ల వరకు ఉన్నాయి.

పరిణీతి, రాఘవ్  ప్రేమ కథ   

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ లో కలిసి చదువుకున్నారు. వారికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీరి ద్వారా పరిచయం పెరిగింది. అదికాస్తా ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కొద్ది కాలం క్రితమే ఈ విషయం బయటకు తెలిసింది.  వీరిద్దరూ కలిసి ఓ హోటల్‌కు డిన్నర్‌ డేట్‌కు వెళ్లారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఓ ఆప్ ఎంపీ వీరి పెళ్లి గురించి చెప్పడంతో, ఆ వార్తలు వాస్తవాలేనని తేలిపోయాయి.

పుష్కరకాలంగా సినిమాల్లో రాణిస్తున్న పరిణీతి

పరిణీతి చోప్రా సుమారు 12 ఏళ్లుగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తోంది. 2011లో రణవీర్ సింగ్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘లేడీస్ vs రికీ బహ్ల్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2012లో వచ్చిన ‘ఇష్క్‌జాదే’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ప్రస్తుతం పరిణీతి చోప్రా, అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ‘మిషన్ రాణిగంజ్’ విడుదలకు సిద్ధమవుతోంది.

Read Also: ఆర్టిస్టులు అందుబాటులో లేకకాదు, ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ వాయిదా వెనుక అసలు కథ ఇదే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget