అన్వేషించండి

Game Changer Shooting: ఆర్టిస్టులు అందుబాటులో లేకకాదు, ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ వాయిదా వెనుక అసలు కథ ఇదే!

రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మరోసారి వాయిదా పడింది. కొంత మంది ఆర్టిస్టుల డేట్స్ కుదరక షూటింగ్ వాయిదా పడినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించినా, దాని వెనుక వేరే కథ ఉన్నట్లు తెలుస్తోంది.

‘RRR’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. అయితే, పలు కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మరోసారి వాయిదా  

వాస్తవానికి ఈ సినిమాను ప్రకటించి చాలా కాలం అవుతున్నది. ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణాలు చాలా ఉన్నాయి. దర్శకుడు ఓవైపు 'ఇండియన్ 2'ను షూట్ చేస్తూనే, మరోవైపు 'గేమ్ ఛేంజర్' కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. అటు నిర్మిణ సంస్థకు బడ్జెట్ కూడా తడిసిమోపెడు అవుతుందట. రీసెంట్ గా ‘ఇండియన్ 2’ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. చెర్రీ కూడా ప్రీగానే ఉండటంతో తాజాగా యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ, ఈ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ మళ్ళీ వాయిదా పడింది. అయితే, షూటింగ్ వాయిదాపై  నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.  కొంతమంది ఆర్టిస్టుల డేట్స్ కుదరకే వాయిదా పడినట్లు వెల్లడించింది. ఈ షెడ్యూల్ షూట్ ని అక్టోబర్ సెకండ్ వీక్ కి కంప్లీట్ చేయనున్నట్లు తెలిపింది.   

షూటింగ్ వాయిదా వెనుక అసలు కారణం ఇదే!

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటానికి హీరో రామ్ చరణ్ అని తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన ముఖానికి చిన్న గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ గాయం కారణంగా ముఖానికి మేకప్ వేయడంలో ఇబ్బంది కలుగుతుందట. అందుకే, డాక్టర్లు ఆయనకు ఓ 10 రోజులు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. చరణ్ గాయం తగ్గిన తర్వాత, అక్టోబర్ 6 నుంచి హైదరాబాద్‌లో ‘గేమ్‌ ఛేంజర్’ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

నిరుత్సాహంలో చరణ్ అభిమానులు

‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మరోసారి వాయిదా పడటంతో ఆయన అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అంతేకాదు, చరణ్ కు గాయం అయ్యిందని తెలియడంతో కంగారు పడుతున్నారు. వీలైనంత త్వరగా ఆయన కోలుకుని షూటింగ్ కు తిరిగిరావాలని కోరుకుంటున్నారు.  ఇక ఈ సినిమాలో చరణ్ సరసన  కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.  అంజలి, శ్రీకాంత్, సునీల్, SJ సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, అనన్య సహా పలువురు నటిస్తున్నారు.  థమన్ సంగీతం అందిస్తుండగా,  దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read Also: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Tejaswini Nandamuri Tollywood Debut : సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Embed widget