Alia Rashmika Dance Naatu Naatu : ‘నాటు నాటు’ పాటకు ఆలియా, రష్మిక స్టెప్పులు - దద్దరిల్లిన ఆడిటోరియం
‘నాటు నాటు’ పాటతో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ దద్దరిల్లింది. ఆలియా భట్, రష్మిక మందన్న కలిసి ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆడియెన్స్ సైతం లేచి నిల్చొని డ్యాన్స్ చేశారు.

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న కళలను, సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు.
ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలకు అంబానీ కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రజనీకాంత్ తన కుమార్తె సౌందర్యతో కలిసి ఈ వేడుకలు వచ్చారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ దంపతులు, సిద్ధార్థ్-కియారా అద్వానీ దంపతులు, దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా-నిక్ జొనాస్, ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, సోనమ్ కపూర్, జాన్వీ కపూర్, శ్రద్ధాకపూర్, సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ దంపతులు, కరిష్మా కపూర్, షాహిద్ కపూర్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, కరణ్ జోహార్ పాల్గొన్నారు. అటు సచిన్ టెండూల్కర్ తన ఫ్యామిలీతో కలిసి వచ్చారు. అభినవ్ బింద్రా, సానియా మీర్జా, దీపా మాలిక్ సహా పలువురు క్రీడాకారులు సైతం హాజరయ్యారు.
‘నాటు నాటు’ పాటకు ఆలియా, రష్మిక స్టెప్పులు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న వారిని అద్భుతంగా అలరించాయి. ‘RRR’ సినిమాలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ పాట ఈ వేడుకలో హైలెట్ గా నిలిచింది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. స్టేజి మీద వీరిద్దరు డ్యాన్స్ చేస్తుంటే, స్టేజి కింద ఉన్న ఆహ్వానితులు లేచి నిచ్చొని డ్యాన్స్ చేశారు. కల్చరల్ సెంటర్ అంతా మార్మోగిపోయింది. ప్రస్తుతం ఈ ఫర్ఫార్మెన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లోనూ రష్మిక ఫర్ఫార్మెన్స్
ఇక రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ ప్రారంభోత్సంలోనూ రష్మిక మందన్నన అదిరిపోయే స్టెప్పులు వేసింది. ‘పుష్ప’ సినిమాలోని ‘సామి రారా సామి’ అనే పాటతో పాటు ‘శ్రీవల్లి’ అనే పాటకు డ్యాన్స్ చేసి ఆడియెన్స్ ను అలరించింది. అహ్మదాబాద్ లో జరిగిన ఐపీఎల్ 2023 ప్రారంభోత్సవ వేడుకల్లో తెలుగు పాటలకు డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకుంది. మిల్కీ బ్యూటీ తమన్నా, నేషనల్ క్రష్ రష్మిక కలిసి మాస్ స్టెప్పులు వేశారు. రష్మిక ‘పుష్ప’ సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తుంటూ స్టేడియంలోని ప్రేక్షకులు స్టెప్పులు కలిపారు. అటు ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమాలోని ‘డోలీనా’ పాటకు అదరిపోయే స్టెప్పులు వేసింది. ఇక ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ గోల చేశారు.
Read Also: అమ్మకు అషూరెడ్డి సర్ ప్రైజ్, అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

