Ajith - Prashanth Neel: కేజీఎఫ్ యూనివర్స్‌లోకి అజిత్ - కోలీవుడ్ స్టార్‌తో ప్రశాంత్ నీల్ క్రేజీ డీల్
Ajith to join KGF universe: కేజీఎఫ్ యూనివర్స్‌లో కోలీవుడ్ స్టార్ అజిత్ ఎంటర్ అవుతున్నారా? ఆయనతో రెండు భారీ సినిమాలు తీయడానికి ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నారా? అంటే... 'అవును' అని చెప్పాలి.
కేజీఎఫ్ (KGF)... ఇదొక సినిమా కాదు, బ్రాండ్! రాకీ భాయ్... అదొక పేరు కాదు, బ్రాండ్! ఈ రెండు బ్రాండ్స్ వెనుక ఉన్నది దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). పాన్ ఇండియా యాక్షన్ సినిమాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఘనత ఆయనది. కేజీఎఫ్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'సలార్: సీజ్ ఫైర్' తీసి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఏ భాషలో హీరో అయినా సరే ఆయనతో యాక్షన్ ఫిల్మ్ చేయాలని కోరుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి, ప్రశాంత్ నీల్ ఎవరితో సినిమా చేయాలని అనుకుంటున్నారో తెలుసా? కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar)తో! అదీ 'కేజీఎఫ్' యూనివర్స్ మూవీస్!
అజిత్ హీరోగా రెండు సినిమాలు ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్!
Prashanth Neel to direct Ajith Kumar: అజిత్ కుమార్ హీరోగా ప్రశాంత్ నీల్ రెండు సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కోలీవుడ్ ఇండస్ట్రీ చెబుతోంది. ప్రజెంట్ అజిత్ 'విడా మయుర్చి' సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మధ్య గ్యాప్ తీసుకున్నప్పుడు ఆయన్ను ప్రశాంత్ నీల్ కలిశారట. తనకు మూడు సంవత్సరాల డేట్స్ కావాలని, రెండు సినిమాలు తీయాలని అనుకుంటున్నట్లు చెప్పారట. ఆ రెండు సినిమాలు కేజీఎఫ్ యూనివర్స్ (KGF Universe)లో భాగం అని టాక్.
అజిత్ రెండో సినిమాకు, కేజీఎఫ్ మూడో సినిమాకు లింక్!
అజిత్ హీరోగా ప్రశాంత్ నీల్ చేయబోయే రెండు సినిమాల్లో మొదటిది సోలో హీరో ఫిల్మ్ అని కోలీవుడ్ చెబుతోంది. హీరోగా ఆ సినిమా అజిత్ 64వ సినిమా అవుతుంది అట! అజిత్ హీరోగా ప్రశాంత్ నీల్ చేయబోయే రెండో సినిమా క్లైమాక్స్, 'కేజీఎఫ్ 3'కి లింక్ ఉంటుందట. మరి, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అజిత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తారా? లేదంటే మొదటి సినిమా చేశాక మరొక సినిమా చేసి రెండోది చేస్తారా? అనేది చూడాలి.
Also Read: 'గేమ్ ఛేంజర్' రెండో సాంగ్ లీక్ కానివ్వను - మెగా అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్
అజిత్ హీరోగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన 'విడా ముయుర్చి' (Vida Muyarchi) దీపావళి కానుకగా విడుదల కానుంది. ఆ తర్వాత ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' పూర్తి చేస్తారు. ప్రశాంత్ నీల్ సినిమా 2025లో మొదలు పెట్టి, 2026లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
Also Read: హను రాఘవపూడి సినిమాలో ప్రభాస్ రోల్ అదేనా - ఎన్టీఆర్, బన్నీ తర్వాత ఆ లిస్టులోకి రెబల్ స్టార్!?
ప్రజెంట్ 'సలార్ 2' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా చేయాలి. ఆ రెండు సినిమాల తర్వాత అజిత్ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 'సలార్' సినిమాకూ, 'కేజీఎఫ్'కు లింక్ ఉందని... కేజీఎఫ్ యూనివర్స్‌లో సలార్ కూడా భాగం అని ప్రచారం జరిగింది. అయితే... అటువంటిది ఏమీ లేదని ఆ సినిమా విడుదలకు ముందు ప్రశాంత్ నీల్ చెప్పారు.