అన్వేషించండి

Prabhas: హను రాఘవపూడి సినిమాలో ప్రభాస్ రోల్ అదేనా - ఎన్టీఆర్, బన్నీ తర్వాత ఆ లిస్టులోకి రెబల్ స్టార్!?

Prabhas Fauji Update: ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా లవ్ స్టోరీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో ఆయన క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినబడుతోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలోని దర్శకులలో ప్రేమ కథలు తెరకెక్కించడంలో యువ దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi)ది ప్రత్యేక శైలి. తొలి సినిమా 'అందాల రాక్షసి' నుంచి పాన్ ఇండియా హిట్ 'సీతా రామం' వరకు ఆయన తీసిన ప్రతి ప్రేమ కథా చిత్రం, అందులో హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ఓ పాన్ ఇండియా లవ్ స్టోరీని ఆయన తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 

బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్న ప్రభాస్!
Prabhas Role In Fauji Movie: ప్రభాస్, హను రాఘవపూడి సినిమాకు 'ఫౌజి' టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే... ఇంకా ఆ టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేయలేదు అనుకోండి. లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించనున్నారట. ఓ పూజారి తనయుడిగా ఆయన పాత్ర ఉంటుందని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తర్వాత ఆ రోల్!
యువ కథానాయకులలో బాహ్మణ యువకుడి క్యారెక్టర్లు అంటే ప్రేక్షకులు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR). 'అదుర్స్' సినిమాతో బ్రాహ్మణ యువకుడి క్యారెక్టర్లకు ఆయన ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆ తర్వాత 'డీజే దువ్వాడ జగన్నాథం' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం బ్రాహ్మణ యువకుడి పాత్ర చేశారు. వాళ్లిద్దరి తర్వాత ఆ లిస్టులో చేరుతున్న హీరో ప్రభాస్.

హను రాఘవపూడి సినిమా అంటే సెటిల్డ్ హ్యూమర్ ఉంటుంది. సో... 'అదుర్స్', 'డీజే' టైపులో హీరో నుంచి కామెడీ ఆశించలేం. పైగా, కథా నేపథ్యం మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు కాలంలో ఉంటుందట. అందువల్ల, ఇటీవల తెరపై చూసిన పాత్రలకు ప్రభాస్ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు.

ప్రభాస్ సరసన పాకిస్తాన్ హీరోయిన్ నటిస్తుందా?
ప్రభాస్, హను రాఘవపూడి సినిమా హీరోయిన్ గురించి రెండు మూడు రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో కథానాయికగా పాకిస్తాన్ నటి సజల్ అలీని ఎంపిక చేశారని! అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మామ్' సినిమాలో ఆవిడ నటించింది. ఇప్పుడు ప్రభాస్ జోడీగా హను రాఘవపూడి ఆమెను ఎంపిక చేశారని టాక్. అయితే... 'సీతా రామం'తో తెలుగు తెరకు పరిచయమై, అతి తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ పేరు కూడా బలంగా వినబడుతోంది. మరి, ఆ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారో?

Also Readమెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే, అల్లు అర్జున్ మీద ట్రోల్స్ ఆపేయాలి - హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్


ఆగస్టు నెలాఖరు నుంచి లేదా అక్టోబర్ నుంచి హను రాఘవపూడి సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని ప్రభాస్ భావిస్తున్నారట. ఇది కాకుండా ఆయన చేతిలో 'సలార్ 2', మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', ఇంకా 'కల్కి 2' ఉన్నాయి. 

Also Readకంగువ ఫస్ట్ సాంగ్... ఎక్స్‌ప్రెషన్స్‌తో సూర్య, మ్యూజిక్‌తో డీఎస్పీ కుమ్మేశారంతే!

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Embed widget