అన్వేషించండి

Game Changer Second Song: 'గేమ్ ఛేంజర్' రెండో సాంగ్ లీక్ కానివ్వను - మెగా ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్

Thaman On Game Changer Songs: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సాంగ్ గురించి సంగీత దర్శకుడు తమన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇక నుంచి వరుస అప్డేట్స్ ఉంటాయని చెప్పారు.

Game Changer Songs: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఈ మధ్య రిలీజ్ డేట్ గురించి నిర్మాత 'దిల్' రాజు ఓ అప్డేట్ ఇచ్చారు. క్రిస్మస్ బరిలో 'గేమ్ ఛేంజర్' (Game Changer Release Date) విడుదల కానుందని చెప్పారు. ఇప్పుడు సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ (Music Director Thaman) మరొక అప్డేట్ ఇచ్చారు. సెకండ్ సాంగ్ రిలీజ్ గురించి చెప్పారు.

ఆగస్టు నెలాఖరులో 'గేమ్ ఛేంజర్' రెండో సాంగ్!?
''మొన్న 'దిల్' రాజు గారు మంచి బ్లాస్ట్ ఇచ్చారు. ఆగస్టు నెలాఖరు నుంచి మేం అప్డేట్స్ ఇస్తాం. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. శంకర్ గారు ఫిక్స్ చేయాలి. మొన్న ఒక పాట లీక్ అయ్యింది. 'జరగండి' అని! ఇప్పుడు లీక్ కాక ముందు ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాం'' అని ఓ విలేకరుల సమావేశంలో సంగీత దర్శకుడు తమన్ చెప్పారు.

'గేమ్ ఛేంజర్' సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి?
How Many Songs In Game Changer Movie: శంకర్ సినిమాల్లో సాంగ్స్ అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటాయి. ఇప్పటి వరకు ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా చూసినా సరే... పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. 'గేమ్ ఛేంజర్' సాంగ్స్ కోసం స్పెషల్ సెట్స్ వేయించారు. అసలు, ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయ్? అనే ప్రశ్నకు సైతం తమన్ సమాధానం ఇచ్చారు.

''సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. 'గేమ్ ఛేంజర్' రెండో పాటగా ఏది వస్తుంది? అనేది ఇంకా క్లారిటీ లేదు'' అని తమన్ చెప్పారు. అంటే... శంకర్ గారు ఏ సాంగ్ సెలెక్ట్ చేసి బయటకు వదులుతారో చూడాలి. అదీ సంగతి!

Also Read: హను రాఘవపూడి సినిమాలో ప్రభాస్ రోల్ అదేనా - ఎన్టీఆర్, బన్నీ తర్వాత ఆ లిస్టులోకి రెబల్ స్టార్!?

'భారతీయుడు 2' రిమార్క్ 'గేమ్ ఛేంజర్'తో పోవాలి!
శంకర్ దర్శకత్వం వహించిన 'భారతీయుడు 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ముఖంగా దర్శకత్వం మీద విమర్శలు వచ్చాయి. ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'తో ఆ రిమార్క్స్ అన్నిటికీ శంకర్ చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే... 'భారతీయుడు 3' విడుదలకు ఇంకా సమయం ఉంది. అది 2025లో విడుదల కానుంది. దానికి ముందు 'గేమ్ ఛేంజర్' వస్తుండటంతో అందరి చూపు దీని మీద ఉంటుంది.

Also Read: మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే, అల్లు అర్జున్ మీద ట్రోల్స్ ఆపేయాలి - హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్

రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ ఓ కథానాయికగా నటించిన 'గేమ్ ఛేంజర్'లో అంజలి మరో కథానాయిక. ఆవిడ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కనిపించనుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జె. సూర్య తదితరులు కీలకమైన క్యారెక్టర్లు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Yellamma Release Date : ఎల్లమ్మ రిలీజ్ డేట్ ఫిక్స్ - పాన్ ఇండియా స్థాయిలో దేవిశ్రీ ప్రసాద్ మూవీ
ఎల్లమ్మ రిలీజ్ డేట్ ఫిక్స్ - పాన్ ఇండియా స్థాయిలో దేవిశ్రీ ప్రసాద్ మూవీ
Teja Sajja Marriage : యంగ్ హీరో తేజ సజ్జా పెళ్లి - అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్!... ఆ వార్తల్లో నిజమెంత?
యంగ్ హీరో తేజ సజ్జా పెళ్లి - అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్!... ఆ వార్తల్లో నిజమెంత?
Science Fiction Thriller OTT : ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి మర్డర్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి మర్డర్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Aadarsha Kutumbam Release Date : ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ చెప్పేసిన వెంకీ - ఆ రోజున థియేటర్లలో కలుద్దాం
ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ చెప్పేసిన వెంకీ - ఆ రోజున థియేటర్లలో కలుద్దాం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
Cockroach Janata Party: దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌ కోసం కస్టమైజ్డ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రెడ్‌ సీటు, క్రోమ్‌ లుక్‌తో అదుర్స్‌!
ఫాతిమా సనా షేక్‌ కొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ చూశారా బ్రో? రెట్రో లుక్‌తో అదరగొట్టేస్తోంది!
Veeramani Diwali Prank: దీపావళి స్వీట్లు అడిగితే.. రూ.70 కోట్ల ట్యాంకర్ ఆర్డర్.. వైరల్ ప్రాంక్‌కు స్విగ్గీ స్వీట్ ఎండింగ్
దీపావళి స్వీట్లు అడిగితే.. రూ.70 కోట్ల ట్యాంకర్ ఆర్డర్.. వైరల్ ప్రాంక్‌కు స్విగ్గీ స్వీట్ ఎండింగ్
VC Sajjanar: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
Embed widget