జూలై 12న 'ఇండియన్ 2' విడుదల! ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో తెలుసా?

'ఇండియన్ 2'ను తెలుగులో 'భారతీయుడు 2'గా విడుదల చేస్తున్నారు. ఆల్మోస్ట్ 25 కోట్ల బిజినెస్ చేసింది. 

తెలంగాణ (నైజాం)లో 'భారతీయుడు 2'ను రూ. 9 కోట్లకు అమ్మారని తెలిసింది. 

రాయలసీమ (సీడెడ్) ఏరియా హక్కులను రూ. 4 కోట్లకు ఇచ్చారట. 

ఆంధ్రలో 'భారతీయుడు 2'ను రూ. 12 కోట్ల రేషియోలో విక్రయించారు. 

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'భారతీయుడు 2'ను 24 కోట్లకు అమ్మారు.

తెలుగులో 'భారతీయుడు 2'కు మినిమమ్ 45 కోట్ల గ్రాస్ వస్తే తప్ప డిసిట్రిబ్యూటర్లకు రూ. 25 కోట్ల షేర్ రాదు.

'భారతీయుడు 2'కు తెలుగులో లాభాలు రావాలంటే మినిమమ్ రూ. 25 కోట్ల షేర్ రావాలి. 

తెలుగు రైట్స్ ఏషియన్ సినిమాస్, శ్రీదేవి మూవీస్ రూ. 20 కోట్లకు కొని రూ. 24 కోట్లకు అమ్మారు.