సమంత.. హెల్త్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. తను తరచుగా వ్యాయమం చేయడంతో పాటు దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అలాగే తాజాగా తను ఫ్లోర్‌పై ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది. ఇందులో సమంత ఫీట్లు చూసి ఫాలోవర్స్ షాకవుతున్నారు. అలా ఎప్పటికప్పుడు తన స్టంట్స్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది సామ్. ప్రస్తుతం తను సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. తన ఫోటోషూట్స్, హెల్త్ అప్డేట్స్ అన్నీ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. మయాసైటీస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో సామ్ ఇప్పటికీ బాధపడుతోంది. తాజాగా ఆమె హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజర్‌తో పీల్చితే శ్వాస సమస్యలు పోతాయని సలహా ఇచ్చింది. అలాంటి ప్రమాదకర హెల్త్ టిప్ ఇచ్చినందుకు ఓ డాక్టర్ తీవ్రంగా తిట్టిపోశారు. ఇందుకు సామ్ కూడా ఆన్సర్ ఇచ్చింది.