Trisha Reaction : హీరోయిన్ త్రిష ఫైర్ - సారీ చెప్పిన బీజేపీ లీడర్... విజయ్‌పై విమర్శల కాంట్రవర్సీకి చెక్ పడేనా!
Trisha : టీవీకే అధినేత విజయ్‌పై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ చేసిన కామెంట్స్ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తన ప్రస్తావన తీసుకురావడంతో త్రిష దీనిపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు.

Trisha Reaction On BJP Leader Nainar Negendran Comments : కోలీవుడ్ స్టార్, టీవీకే అధినేత విజయ్‌పై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ (Nainar Nagendran) రీసెంట్‌గా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులోకి హీరోయిన్ త్రిషను తీసుకురావడంతో వివాదం నెలకొంది. ఆయన కామెంట్స్‌ను సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు.
త్రిష స్ట్రాంగ్ రియాక్షన్
విజయ్‌పై విమర్శలు చేసే క్రమంలో తన పేరు తీసుకు రావడంపై త్రిష స్పందించారు. ఈ క్రమంలో ఆమె తరఫు లాయర్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ నోట్‌ను ఆమె తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. తన క్లయింట్ త్రిష సూచనల మేరకు అంటూ ఆమె అడ్వకేట్ ఈ నోట్ రిలీజ్ చేశారు. 'పాలిటిక్స్‌లో ఉన్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తి ఇలా మాట్లాడతారని నా క్లయింట్ అస్సలు ఊహించలేదు. ఆమెకు పాలిటిక్స్‌తో ఎలాంటి సంబంధం లేదు.
పొటిలికల్ పార్టీల విషయంలో ఆమె ఎప్పుడూ తటస్థంగానే ఉన్నారు. కేవలం యాక్టింగ్ ద్వారానే త్రిష తానేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నారు. అంతే తప్ప ఇలాంటి పొలిటికల్ కామెంట్స్ వల్ల కాదు. సంబంధం లేని విషయాల్లోకి ఆమెను లాగొద్దు.' అంటూ నోట్‌లో పేర్కొన్నారు.

Also Read : చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ టాలీవుడ్ ఎంట్రీ - యంగ్ బ్యూటీస్‌తో రొమాంటిక్ కామెడీ డ్రామా!
అసలేం జరిగిందంటే?
'ఎంజీఆర్ ప్రారంభించిన అన్నాడీఎంకేలో పళనిసామి, అన్నాదురై ప్రారంభించిన డీఎంకేలో స్టాలిన్ ఉన్నారు. నాలా సొంతంగా పార్టీ ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేయగలరా? అని విజయ్ సవాల్ విసిరారు కదా. మీరేమంటారు?' అంటూ రీసెంట్‌గా నయినార్ నాగేంద్రన్‌ను అడగ్గా... 'పాపం ఆయనకు అనుభవం లేదు. ముందుగా త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు వచ్చి తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలి.' అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై టీవీకే నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. అటు సోషల్ మీడియాలో నాగేంద్రన్ కామెంట్స్‌పై విమర్శలు వచ్చాయి.
సారీ చెప్పిన నాగేంద్రన్
తాజాగా ఈ వివాదంపై నయినార్ నాగేంద్రన్ సారీ చెప్పారు. ఎవరి మనసును బాధ పెట్టే ఉద్దేశం తనకు లేదని... పొరపాటున ఆ కామెంట్స్ చేసినట్లు తెలిపారు. తాను ఎవరి మనసును బాధ పెట్టకూడదని అనుకుంటానని... ఆ వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వివాదానికి చెక్ పడనున్నట్లు తెలుస్తోంది.
























