Dhruv Vikram : చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ టాలీవుడ్ ఎంట్రీ - యంగ్ బ్యూటీస్‌తో రొమాంటిక్ కామెడీ డ్రామా!
Dhruv Vikram Tollywood : చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చేసేందుకు రెడీ అవుతున్నారట.

Dhruv Vikram Tollywood Debut With Mythri Movie Makers : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ గతేడాది 'బైసన్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే, ఈ మూవీ తెలుగులో అంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు డైరెక్ట్‌గా తెలుగులోనే మూవీ చేసేందుకు ధ్రువ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో ధ్రువ్‌తో డైరెక్టర్ మణిరత్నం ఓ క్యూట్ లవ్ స్టోరీ తీస్తారనే ప్రచారం సాగింది. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్ అనే రూమర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు తాజాగా టాలీవుడ్‌లోనే ఎంట్రీ ఇచ్చేందుకు ధ్రువ్ ప్లాన్ చేస్తున్నారట.
యంగ్ బ్యూటీస్
ధ్రువ్ విక్రమ్ తెలుగులో చేయబోయే మూవీలో రుక్మిణి వసంత్‌తో పాటు యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా హీరోయిన్లుగా చేస్తారంటూ లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాకు న్యూ డైరెక్టర్ దీపక్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. 'మనసానమః' షార్ట్ ఫిల్మ్‌తో ఈయన ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. దీన్ని తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ డబ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా విక్రమ్ కుమారుడి మూవీకే డైరెక్టర్‌గా ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కబోతోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని... నటీనటులు, ఇతర వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.
Also Read : విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి? - ముంబయిలో లవ్ బర్డ్స్... ఇన్విటేషన్స్ కోసమేనా...
























