Vijay Deverakonda Rashmika Wedding : విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి! - వెడ్డింగ్ కార్డు చూశారా?... హైదరాబాద్‌లో రిసెప్షన్
Vijay Deverakonda Wedding : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఈ నెల 26న జరగనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ వైరల్ అవుతోంది.

Vijay Deverakonda Rashmika Wedding Invitation Viral : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినా ఈ నెల 26న వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉదయపూర్ ప్యాలెస్‌లో
రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో ఈ నెల 26న విజయ్, రష్మికల పెళ్లి జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్‌లోని ఫేమస్ తాజ్ కృష్ణ లగ్జరీ హోటల్‌లో మార్చి 4న సాయంత్రం 7 గంటల నుంచి రిసెప్షన్ జరగనుంది. ఈ మేరకు సరికొత్తగా వెడ్డింగ్ ఇన్విటేషన్ ట్రెండ్ అవుతోంది.
Wow, look what I stumbled upon! 👀 It seems like Vijay Deverakonda and Rashmika Mandanna's wedding card is making the rounds. Such beautiful design! 💖 Can't wait to see what's next for them. ✨ #VijayDeverakonda #RashmikaMandanna pic.twitter.com/qpaPnx52hZ
— Supreme Rebel 🌊 (@supremerebel7) February 16, 2026
Also Read : చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ టాలీవుడ్ ఎంట్రీ - యంగ్ బ్యూటీస్‌తో రొమాంటిక్ కామెడీ డ్రామా!
ముంబయిలో లవ్ బర్డ్స్
పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక ముంబయి ఎయిర్ పోర్టులో సందడి చేశారు. ఇద్దరూ ఒకే కలర్ దుస్తుల్లో ముఖానికి మాస్క్‌తో కనిపించగా... ఓ ఫ్యాన్ విజయ్‌ను గుర్తు పట్టి సెల్ఫీ అడగ్గా ఆయన మాస్క్ తీసి సెల్ఫీ ఇచ్చారు. ఈ నెల 26 కోసం వెయిట్ చేస్తున్నామని ఓ కెమెరా మ్యాన్ విజయ్‌తో అనగా... 'వెయిటింగ్ ఎందుకు? ఎలాగైనా 26 వస్తుంది కదా?' అంటూ చెప్పారు. విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి ముంబయిలో సెలబ్రిటీలను తమ పెళ్లికి ఆహ్వానించేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకూ అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ తమ పెళ్లి డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు.
పెళ్లి వీడియో స్ట్రీమింగ్‌కు ఆఫర్?
అటు, వీరిద్దరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కోసం ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' ఏకంగా రూ.60 కోట్లు ఆఫర్ చేసిందట. అయితే, దీనికి ఈ జంట నో చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో నయనతార విఘ్నేష్‌ల పెళ్లి వీడియో స్ట్రీమింగ్‌కు కూడా రూ.25 కోట్లు ఆఫర్ చేయగా వివాదమైంది.
గతేడాది అక్టోబర్ 3న విజయ్, రష్మికల ఎంగేజ్మెంట్ అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరగ్గా... పెళ్లి కూడా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఉదయపూర్ ప్యాలెస్‌లో చేసుకోనున్నట్లు సమాచారం. 2018లో వచ్చిన 'గీత గోవిందం'లో విజయ్ రష్మిక తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగింది. 'డియర్ కామ్రేడ్' మూవీలోనూ కలిసి నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 'రణబాలి'లో కలిసి నటించబోతున్నారు.























