Lavanya Tripathi Twitter : అందాల రాక్షసి ట్విట్టర్ హ్యాక్ చేసిన ఫారినర్
అందాల రాక్షసి లావణ్యా త్రిపాఠి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఆమె తెలిపారు.

హీరోయిన్ లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) ట్విట్టర్ అకౌంటును ఎవరో హ్యాక్ (Twitter Account Hacked) చేశారు. ఈ విషయాన్ని అందాల రాక్షసి ఇంస్టాగ్రామ్ స్టోరీలో తెలిపారు.
ట్వీట్స్ చేస్తే నాకు సంబంధం లేదు!
''అందరికీ ఒక్క విషయం చెప్పాలి... నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఒకవేళ ఆ అకౌంట్ నుంచి ఏవైనా ట్వీట్స్ వస్తే నాకు సంబంధం లేదు. నేను చేసినట్టు కాదు. మళ్ళీ అకౌంట్ నా చేతికి రావడానికి ట్రై చేస్తున్నాం'' అని లావణ్యా త్రిపాఠి తెలిపారు.
లావణ్యా త్రిపాఠి ట్విట్టర్ అకౌంటులో పేరును కూడా హ్యాక్ చేసిన వాళ్ళు చేంజ్ చేశారు. జెరెమీ అని ఏదో రాశారు. ఇంకో విషయం ఏంటంటే... ఫోటో కూడా చేంజ్ చేశారు. ఆ ఫోటో బదులు మంచి ఫోటోను డీపీగా పెడితే బావుండేదని లావణ్యా త్రిపాఠి కామెంట్ చేశారు. అదీ సంగతి!
Also Read : ఆస్కార్ వచ్చినట్లు బన్నీకి తెలియదా? లేదంటే కావాలని కంగ్రాట్స్ చెప్పలేదా?
ఇటీవల 'జీ 5' ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ 'పులి - మేక'లో ఐపీఎస్ కిరణ్ ప్రభ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటించారు. ఆమె పోలీస్ రోల్ చేయడం తొలిసారి. ఆది సాయి కుమార్ కీలక పాత్రలో, ఆమెకు జంటగా నటించారు. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి ఓ తమిళ సినిమా చేస్తున్నారు. రెండు మూడు తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.
Also Read : బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్
సినిమాల కంటే లావణ్యా త్రిపాఠి పెళ్లి ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ (Varun Tej)తో ఆమె ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ దాన్ని ఖండించలేదు. అలాగని, అంగీకరించలేదు. రెండు సినిమాలు... 'అంతరిక్షం', 'మిస్టర్'లో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారని ఫిల్మ్ నగర్ గుసగుస. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని, ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారనేది కొత్త ఖబర్. అది పక్కన పెడితే... పెళ్లి గురించి లావణ్య సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి
Lavanya Tripathi On Marriage : 'పులి - మేక' వెబ్ సిరీస్ బృందంతో కలిసి ఆ మధ్య 'సుమ అడ్డా' కార్యక్రమానికి లావణ్యా త్రిపాఠి వెళ్లారు. అక్కడ పెళ్లి టాపిక్ వచ్చింది. పెళ్లి గురించి లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ ''నా తల్లిదండ్రుల గురించి పెళ్లి విషయంలో ఒత్తిడి ఏమీ లేదు. అందుకని, నేనూ పెళ్లి గురించి ఆలోచించడం లేదు. పెళ్లి గురించి కలలు కూడా ఏమీ కనడం లేదు. ప్రస్తుతానికి నా దృష్టి అంతా సినిమాలపై ఉంది. నా పెళ్లి జరుగుతుంది... అది నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు'' అని చెప్పారు.
'మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు? అని అడిగితే ''నేను వరుణ్ తేజ్ పేరు చెబుతా'' అని లావణ్యా త్రిపాఠి సమాధానం ఇచ్చారు. ''వరుణ్ తేజ్ ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ చాలా డిఫరెంట్. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వరుణ్ చాలా సరదాగా ఉంటారు. బయటకు ఆయన సీరియస్ గా కనపడతారు కదా! కానీ, అలా కాదు'' అని లావణ్యా త్రిపాఠి చెప్పారు. వరుణ్ తేజ్ హ్యాండ్సమ్ అని లావణ్యా త్రిపాఠి చెప్పిన సమాధానం హైలైట్ అవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

