Oscars 2023 - Allu Arjun : ఆస్కార్ వచ్చినట్లు బన్నీకి తెలియదా? లేదంటే కావాలని కంగ్రాట్స్ చెప్పలేదా?
'నాటు నాటు...' పాటకు ఆస్కార్ రావడంతో యావత్ తెలుగు చిత్రసీమ సంబరాలు చేసుకుంది. 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందాన్ని అందరూ అభినందించారు, ఒక్క అల్లు అర్జున్ తప్ప!
మార్చి 13ను తెలుగు సినిమా చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆ రోజు 'ఆర్ఆర్ఆర్' సినిమాది అని గర్వంగా చెబుతుంది. 'నాటు నాటు...' పాటకు (Naatu Naatu Won Oscar) ఆస్కార్ రావడంతో ఇండస్ట్రీ జనాలు అందరూ ఆనందంలో మునిగి తేలారు. ఆ మాటకు వస్తే... సంబరాలు చేసుకున్నారు. 'ఆర్ఆర్ఆర్'లో పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డు తమకు వచ్చినంత సంతోషపడ్డారు. 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం ఇంకా తన స్పందన తెలియజేయలేదు.
ఆస్కార్ వచ్చినట్లు బన్నీకి తెలియదా?
ఆస్కార్ అవార్డు రావడానికి ముందు 'ఆర్ఆర్ఆర్' టీమ్ చేసిన ఖర్చుపై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు వివాదానికి, మాటల తూటాలకు దారి తీశాయి. అయితే, అవార్డు వచ్చిన తర్వాత ఆయన అభినందనలు తెలిపారు. నందమూరి తారక రత్న పెద్ద కర్మ రోజున కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సోదరులను బాలకృష్ణ పలకరించలేదని, కనీస మర్యాద ఇవ్వలేదని బాలకృష్ణ మీద సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందానికి ఆయన కూడా శుభాకాంక్షలు చెప్పారు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... సీనియర్ స్టార్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు వంటి ఈతరం స్టార్స్ సైతం 'నాటు నాటు...'కు ఆస్కార్ రావడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చిత్రసీమలో చిన్న, పెద్ద వ్యత్యాసం లేకుండా హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఎక్కడా లేదు.
ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్... అల్లు అర్జున్ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసినా సరే 'ఆర్ఆర్ఆర్' గురించి ఒక్క పోస్ట్ కూడా లేదు. ఆస్కార్ గురించి తన స్పందన తెలుపని ఏకైన టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మాత్రమే! ఆయన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పిక్చర్స్ సైతం 'ఆర్ఆర్ఆర్' బృందానికి విషెష్ చెప్పింది. దాంతో అల్లు అర్జున్ ఎందుకు చెప్పలేదనేది డిస్కషన్ పాయింట్ అవుతోంది.
'పుష్ప 2' చిత్రీకరణలో...
అల్లు అర్జున్ ఇప్పుడు 'పుష్ప 2' చిత్రీకరణ చేస్తున్నారు. హైదరాబాదులోనే సినిమా షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణలో బిజీగా ఉండటంతో ఆస్కార్ వచ్చిన విషయం ఆయనకు తెలియలేదని అనుకోవడానికి వీల్లేదు. 'పుష్ప 2' దర్శకుడు సుకుమార్ సైతం కీరవాణి, చంద్రబోస్, రాజమౌళితో పాటు 'ఆర్ఆర్ఆర్' సినిమా బృందానికి అభినందనలు తెలిపారు. వేదిక మీద ఆస్కార్ అందుకున్న వ్యక్తుల్లో ఒకరైన చంద్రబోస్ 'పుష్ప'లో అద్భుతమైన పాటలు రాశారు. 'పుష్ప 2'కు కూడా ఆయన పని చేస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత పాటలు రాయడమంటే సినిమాకు క్రేజ్ వస్తుంది. హిందీలో కూడా తెలుగు పాటలు రాసిన వ్యక్తి గురించి బాగా చెప్పవచ్చు.
Also Read : బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్
'నాటు నాటు...'కు ఆస్కార్ రావడాన్ని అల్లు అర్జున్ ఎందుకు లైట్ తీసుకున్నారో మరి? లేదంటే లేటుగా అయినా లేటేస్టుగా విషెష్ చెప్పాలని వెయిట్ చేస్తున్నారో? నలుగురిలో నారాయణ అన్నట్టు కాకుండా 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ ప్రశంస చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉండాలని ఆలస్యం చేస్తున్నారా? వెయిట్ అండ్ సి.
Also Read : ఆస్కార్ తెచ్చిన రాజమౌళి - దర్శక ధీరుడికి చరిత్ర సలామ్ కొట్టాల్సిందే