Prabhas: ప్రభాస్ సినిమాతో తరుణ్ రీ ఎంట్రీ? ఆ న్యూస్ వెనుక అసలు కథ ఇదేనా?
Tharun In Prabhas Movie?: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో తరుణ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడా? ఉన్నట్టుండి ఆయన రీ ఎంట్రీ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఒక్కసారి అసలు విషయంలోకి వెళితే...

తరుణ్... ఒకానొక సమయంలో తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన హీరో. లవర్ బాయ్ ఇమేజ్‌తో సినిమాలు చేశారు. ఆయన చేసిన ప్రేమ కథలు భారీ విజయాలు సాధించాయి. అయితే అనూహ్యంగా తరుణ్ ఫేడవుట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించనున్నారని ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తరుణ్ రీ ఎంట్రీ గురించి బాలీవుడ్ మీడియా సైతం మాట్లాడుతోంది. అందుకు కారణం... ప్రభాస్! ఆ వివరాల్లోకి వెళితే...
ప్రభాస్ సినిమాలో తరుణ్!?
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'బాహుబలి' తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. 'సలార్' వచ్చే సరికి సౌత్ కొరియా స్టార్స్ కూడా ఆయన గురించి మాట్లాడారు. సౌత్ కొరియాలో స్టార్ హీరో, హాలీవుడ్ సినిమాలు కూడా చేసిన డాన్ లీ అయితే 'సలార్' రిలీజ్ టైంలో తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్టర్ షేర్ చేశారు.
'సలార్' పోస్టర్ డాన్ లీ షేర్ చేసినప్పటి నుంచి... ప్రభాస్ సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ చేస్తారని ప్రచారం మొదలైంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందనున్న పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్' కోసం డాన్ లీని సంప్రదించారని ఒక టాక్. మరికొందరు అయితే 'సలార్' సీక్వెల్ కోసం ఆయన దగ్గరకు దర్శకుడు ప్రశాంత్ నీల్ వెళ్లారని చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు ప్రభాస్ గానీ, ఆయన దర్శకులు గానీ తమ సినిమాలో డాన్ లీ నటిస్తున్నాడని చెప్పలేదు. అటు డాన్ లీ కూడా ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. అయితే అతనితో తరుణ్ ఫోటో దిగడమే ప్రభాస్ సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు రావడానికి కారణం అయ్యింది.

అమెరికాలోని లాస్ వేగాస్ సిటీకి తరుణ్ వెళ్లారు. అక్కడ డాన్ లీతో కలిసి ఫోటో దిగారు. అది సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటి నుంచి ప్రభాస్ 'స్పిరిట్' సినిమాతో తరుణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాయి. అది అసలు సంగతి. ప్రభాస్ సినిమాలో డాన్ లీ నటిస్తున్నారనేది ఇంకా అఫీషియల్‌గా ఎవరూ చెప్పలేదు. అటువంటిది డాన్ లీతో ఫోటో దిగాడని ప్రభాస్ సినిమాతో తరుణ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పడం చాలా తొందరగా అవుతుంది.
Also Read: పవర్ ఫుల్ లుక్స్... 'హరిహర వీరమల్లు' పవన్ కొత్త స్టిల్స్ చూడండి





















