HHVM Trailer: వీరమల్లు ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆ గొంతుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండీ!
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' ట్రైలర్ అభిమానులకు నచ్చింది. సినిమాపై హైప్ పెంచేలా ఉంది. ట్రైలర్ ప్రారంభంలో ఒక వాయిస్ ఓవర్ వినిపించింది. అది ఎవరు ఇచ్చారో తెలుసా?

పవన్ కళ్యాణ్ థియేటర్లలో సందడి చేసి ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా? 'బ్రో' విడుదల దాదాపు రెండేళ్ల అవుతోంది. ఈ మధ్య కాలంలో కొన్ని టీజర్లు, గ్లింప్స్ మాత్రమే వచ్చాయి. పవన్ నుంచి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ల ఆకలి తీర్చేలా 'హరిహర వీరమల్లు' ఉంటుందని ట్రైలర్ నమ్మకం కలిగించింది. ఈ రోజు విడుదలైన ట్రైలర్ ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్ ఎవరిదో తెలుసా?
వీరమల్లుకు అర్జున్ దాస్ వాయిస్!
తమిళ నటుడు అర్జున్ దాస్ తెలుసు కదా!? లోకేష్ కనగరాజ్ తీసిన సినిమాలతో తెలుగులో కూడా పాపులర్ అయ్యారు. తెలుగులో 'బుట్ట బొమ్మ' సినిమా కూడా చేశారు. అతనిది టిపికల్ వాయిస్. ఆ గొంతుకు సపరేట్ ఫ్యాన్ వేసి ఉంది. కంచు కంఠం అని కొందరు కామెంట్ చేశారు కూడా! సినిమా ఈవెంట్లలో యాంకర్లు ఆ గొంతు విని భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
'హరిహర వీరమల్లు' ట్రైలర్ ప్రారంభంలో వచ్చిన సంభాషణలకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. 'హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం... ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం... ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం...' అంటూ వచ్చిన మాటలు చెప్పింది అర్జున్ దాస్.
Also Read: పవర్ ఫుల్ లుక్స్... 'హరిహర వీరమల్లు' పవన్ కొత్త స్టిల్స్ చూడండి
When #PawanKalyan garu asks you to lend your voice for his movie trailer, you say yes. No questions asked!This one is for you Sir 🤗♥️@PawanKalyan Sir wishing you & your entire team the very best for #HHVM #HariHaraVeeraMallu ⚔️ 🔥
— Arjun Das (@iam_arjundas) July 3, 2025
▶️ https://t.co/yWnCHuS6KZ…
'ఓజీ'లో నటిస్తున్న అర్జున్ దాస్...
పవన్ కళ్యాణ్ స్వయంగా అడగటంతో!
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' సినిమాలో అర్జున్ దాస్ నటిస్తున్నారు. ఆయన ఒక కీలకమైన రోల్ చేస్తున్నారు. షూటింగ్ చేసేటప్పుడు అయని గొంతు విని పవన్ కళ్యాణ్ స్వయంగా అడగటంతో 'హరిహర వీరమల్లు' ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. 
''పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగితే... మీరు ఎస్ అనే చెబుతారు. వేరే ప్రశ్నలు అడగరు. ఇది మీ కోసమే పవన్ కళ్యాణ్ సార్... హరిహర వీరమల్లు టీం అందరికీ ఆల్ ద బెస్ట్'' అని అర్జున్ దాస్ ట్వీట్ చేశారు.





















