అన్వేషించండి

Sonusood: 'సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం' - అరెస్ట్ వారెంట్‌ వార్తలపై సోనూసూద్ తీవ్ర అసహనం

Sonusood Arrest Warrant: తనకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందన్న వార్తలపై నటుడు సోనూసూద్ స్పందించారు. తమ లాయర్స్ కోర్టుకు సమాధానం ఇచ్చారని.. మీడియా అనవసరంగా దృష్టి సారిస్తోందని అన్నారు.

Sonusood Tweet On Arrest Warrant Issue: ప్రముఖ నటుడు సోనూసూద్‌కు (Sonusood) లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ కావడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తాజాగా పోస్ట్ పెట్టారు. 'సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తోన్న వార్తపై సంచలనాత్మకమైన విషయాలను స్పష్టం చేయాలి. విషయం సూటిగా చెప్పాలంటే నాకు ఎలాంటి సంబంధం లేని అంశం. ఈ విషయంలో కోర్టు నన్ను సాక్షిగా పిలిచింది. మా న్యాయవాదులు కోర్టుకు సమాధానం ఇచ్చారు. ఫిబ్రవరి 10వ తేదీన దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తాను. ఆ కేసుకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రమేయం లేని విషయాలను మీ అందరికీ స్పష్టంగా వివరిస్తాను. దీనిపై మీడియా అనవసరంగా దృష్టి సారిస్తోంది. సెలిబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం.' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..?

కాగా, పంజాబ్‌లోని లూథియానా కోర్టు సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లూథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనను మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు చెప్పారు. ఈ కేసులో సోనూసూద్‌ను సదరు న్యాయవాది సాక్షిగా పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం సోనూసూద్ సమాధానం చెప్పడానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోనూసూద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. ముంబయిలోని అందేరి వెస్ట్‌లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్‌కు లుథియానా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ ఈ వారెంట్ జారీ చేశారు. 'సోనూసూద్‌కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలి.' అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీన జరగనుంది. 

కాగా, ఇటీవలే సోనూసూద్ మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్‌గా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫతేహ్' ప్రేక్షకులను అలరించి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సైబర్ మాఫియా కథ ఆధారంగా ఈ సినిమా రూపొందగా.. జాక్వెలైన్ ఫెర్నాండెజ్, సీరుద్దీన్ షా, విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Also Read: Dadasaheb Phalke International Film Festival: దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులపై ఛీటింగ్ కేసు - వెలుగులోకి సంచలన నిజాలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

This Week Theatrical Releases : ఈ దసరాకు మస్త్ ఎంటర్టైన్మెంట్ - ఒకే రోజు థియేటర్లలో మూడు సినిమాలు... మరి మీ ఛాయిస్ ఏంటి?
ఈ దసరాకు మస్త్ ఎంటర్టైన్మెంట్ - ఒకే రోజు థియేటర్లలో మూడు సినిమాలు... మరి మీ ఛాయిస్ ఏంటి?
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Ravi Teja Thulabharam : ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget