Aarti Ravi: సింగర్‌తో స్టార్ హీరో - తండ్రి అంటే టైటిల్ కాదంటూ భార్య ఎమోషనల్ పోస్ట్
Jayam Ravi: కోలీవుడ్ స్టార్ జయం రవి, సింగర్ కెన్నీషాతో కలిసి ఓ వేడుకలో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై ఆయన భార్య ఆర్తి రవి తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Aarti Ravi Emotional Post About Her Husband Jayam Ravi: కోలీవుడ్ స్టార్ జయం రవి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన తన భార్య ఆర్తి రవికి గతేడాది విడాకులు ఇచ్చేశారు. 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆయన సింగర్ కెన్నీషాతో రిలేషన్ షిప్‌లో ఉన్నారని అందుకే భార్యకు విడాకులు ఇచ్చారంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన జయం రవి తాను ఎవరితోనూ రిలేషన్ షిప్‌లో లేనని.. ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
పెళ్లి వేడుకలో సింగర్‌తో..
భార్యతో డివోర్స్ తర్వాత వరుస ప్రాజెక్టులతో జయం రవి (Jayam Ravi) బిజీగా ఉన్నారు. తాజాగా నిర్మాత ఇషారీ గణేష్ కుమార్తె పెళ్లిలో ఆయన సింగర్ కెన్నీషాతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో జయం రవి భార్య ఆర్తి తాజాగా ఇన్ స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జయం రవితో డివోర్స్ కేసు ఇంకా కోర్టులోనే ఉందని.. తనను ఇంటి నుంచి తరిమేశారంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఆర్తి. ఆయనకు అసలు పిల్లల బాధ్యతే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
లెక్కల కంటే ప్రేమకే విలువిచ్చా..
గతేడాదిగా తాను మౌనంగా ఉన్నానని.. ఏమీ మాట్లాడడం లేదని ఆర్తి రవి అన్నారు. 'ఎన్నో ఆరోపణలను మౌనంగా భరించా. నా కంటే నా కుమారుల ప్రశాంతతే ముఖ్యం అనుకున్నా. మౌనంగా ఉన్నంత మాత్రాన నా వైపు నిజం లేదని కాదు. ఈ రోజు ప్రపంచమంతా ఆ ఫోటోలు చూసింది. మా విడాకుల ప్రాసెస్ ఇంకా సాగుతోంది. 18 ఏళ్ల పాటు నాకు తోడుగా ఉన్న వ్యక్తి ఇలా చేశారు. కొన్ని నెలలుగా పిల్లల బాధ్యత నాదే. ఆయన నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. ఆర్థికంగా నైతికంగా నాకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. ఇప్పుటు ఇంటి విషయంలో బ్యాంక్ నుంచి సమస్య ఎదురైంది. నాతో కలిసి ఇదే ఇంటిని నిర్మించిన సదరు వ్యక్తి.. బ్యాంక్ అధికారులతో కలిసి నేను బయటకు వెళ్లిపోయేలా చేశాడు.' అంటూ జయం రవిపై ఆర్తి ఆరోపణలు చేశారు.
అప్పటివరకూ ఇన్ స్టా పేరు ఆర్తి రవి
'డబ్బుల కోసమే విడాకుల డ్రామా ఆడుతున్నానని అంతా అనుకుంటున్నారు. అదే నిజమైతే నా స్వార్థం నేను ఎప్పుడో చూసుకునేదాన్ని. లెక్కల కంటే ప్రేమకే విలువిచ్చా. ప్రేమ విషయంలో నేను బాధ పడడం లేదు. 10, 14 ఏళ్ల వయసున్న నా పిల్లలకు భద్రత కావాలి. చట్టపరమైన అంశాలు వారికి తెలియకపోయినా ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలరు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం, మీటింగ్స్ క్యాన్సిల్ చేయడం, మేనేజర్‌కు రిప్లై ఇవ్వకపోవడం.. గాయాల్లాంటివి.
నేను ఈ రోజు ఓ భార్యగా, అన్యాయానికి గురైన మహిళగా కాదు. పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నా. తండ్రి అంటే టైటిల్ మాత్రమే కాదు. అది ఓ బాధ్యత. డివోర్స్ విషయంలో తుది తీర్పు వచ్చే వరకూ నా ఇన్ స్టా అకౌంట్ పేరు ఆర్తి రవి. ఇప్పటికీ నాన్నా అని నిన్ను పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డాను.' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
View this post on Instagram
Also Read: 'ఆపరేషన్ సింధూర్' పేరిట మూవీ - పవర్ ఫుల్ పోస్టర్ చూశారా?





















