Operation Sindoor: 'ఆపరేషన్ సింధూర్' పేరిట మూవీ - పవర్ ఫుల్ పోస్టర్ చూశారా?
Operation Sindoor Movie: 'ఆపరేషన్ సింధూర్'.. శత్రు దేశం గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా భారత్ చేపట్టిన సైనిక చర్య. ఈ పేరుతో త్వరలోనే బాలీవుడ్ మూవీ రానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.

Operation Sindoor Movie First Poster Unvieled: సోషల్ మీడియా ఓపెన్ చేసినా.. బయట గానీ.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఒకటే మాట 'ఆపరేషన్ సింధూర్'. అన్యాయంగా అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్ర మూకల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా.. శత్రు దేశం వెన్నులో వణుకు పుట్టించేలా.. ప్రతీ భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని చెప్పుకొనే పేరు. మన ఆడబిడ్డల నుదిటిన సింధూరాన్ని చెరిపేసిన ముష్కరులకు అండగా నిలుస్తున్న పాక్‌కు 'ఆపరేషన్ సింధూర్' పేరిట బుద్ధి చెప్తోంది భారత్.
'ఆపరేషన్ సింధూర్' మూవీ
ఇప్పుడు ఈ పవర్ ఫుల్ 'ఆపరేషన్ సింధూర్' (Operation Sindoor) సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కృతం కానుంది. ఈ పేరుతో బాలీవుడ్ మూవీని అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఉత్తమ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. తాజా పోస్టర్‌లో ఓ మహిళ యూనిఫాం ధరించి.. రైఫిల్ పట్టుకుని, నుదిటిన సింధూరంతో ఉన్నట్లుగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఫైటర్ జెట్స్, బాంబులతో విధ్వంసం, మండుతున్న యుద్ధ భూమిని చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
పహల్గాం దాడి.. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పరిణామాలు, పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన సైనిక చర్య వంటి అంశాలే ప్రధానంగా ఈ మూవీలో చూపించనున్నారు. త్వరలోనే యాక్టర్స్, ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.
View this post on Instagram
టైటిల్ కోసం భారీగా పోటీ
'ఆపరేషన్ సింధూర్' టైటిల్ కోసం బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. భారత ప్రభుత్వం ఈ పేరును ప్రకటించిన వెంటనే దాదాపు 15 నిర్మాణ సంస్థలు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్నాయి. ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్‌లో పలువురు నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. టీ సిరీస్, జీ స్టూడియోస్ వంటి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు కూడా ఈ టైటిల్ కోసం అప్లై చేశాయి. చివరకు ఈ మూవీ తెరకెక్కనుంది.
మరోవైపు.. ఆపరేషన్ సింధూర్, మిషన్ సింధూర్, సిందూర్: ది రివెంజ్ అంటూ ఆపరేషన్ కోడ్ నేమ్ స్ఫూర్తితో మూవీ టైటిల్స్ రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే 30కి పైగా అప్లికేషన్స్ అందగా.. ఈ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఒకసారి టైటిల్ వచ్చిన తర్వాత మూడేళ్లలోపే సినిమా తీయాలి. లేకపోతే టైటిల్ తీసేసుకుంటారు.
వెనక్కి తగ్గిన రిలయన్స్
అటు.. ఈ పేరుతో రిజిస్ట్రేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు మరో 5 సంస్థలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్‌మార్క్‌ను సంప్రదించాయి. అయితే, దేశానికి గర్వ కారణమైన ఈ విషయంతో తాము వ్యాపారం చేయలేమని.. తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్ అప్లికేషన్ వెనక్కి తీసుకుంది.
నెటిజన్ల విమర్శలు
'ఆపరేషన్ సింధూర్' పోస్టర్‌పై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ మూవీ ప్రకటన చేయడం ఏంటని మండిపడుతున్నారు. సెన్సిటివ్ అంశాన్ని ఇలా వ్యాపారంగా చేసుకుంటారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





















