Chiranjeevi: చిరంజీవి 43 ఏళ్లు సినీ జర్నీపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి 43 ఏళ్ల సినీ జర్నీపై తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ వైరల్ అవుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి 43 ఏళ్ల మైలురాయిని చేరుకోవడంపై తనయుడు రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తంచేశాడు. చిరు మొదటి సినిమా ఫొటో, లేటెస్ట్ మూవీ ఫొటో షేర్ చేసి 43 ఏళ్లు..స్టిల్ కంటిన్యూ అంటూ పోస్ట్ పెట్టాడు.
43 years and still counting!
— Ram Charan (@AlwaysRamCharan) September 23, 2021
My Appa @KChiruTweets ❤️ pic.twitter.com/2th29femzz
తొలి అవకాశం ఎలా వచ్చిందంటే...చెన్నై లో విజయరాఘవ రోడ్‌లో.. 11వ నెంబర్ ఇంట్లో చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్‌లు అద్దెకు ఉండి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారు. ఓ రోజు సుధాకర్‌కు ‘పునాదిరాళ్లు’ సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. అదే సమయంలో తమిళంలో ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా నుంచి సుధాకర్‌కు పిలుపు వచ్చింది. దీంతో ‘పునాదిరాళ్లు’ సినిమా వదిలేయాలని సుధాకర్ నిర్ణయించుకున్నారు. తనకు వచ్చిన తమిళ సినిమా అవకాశం గురించి చెప్పేందుకు సుధాకర్.. చిరంజీవితో కలిసి ‘పునాది రాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌ను కలిశారు. సుధాకర్ చెప్పింది విని రాజ్‌కుమార్ నిరుత్సాహానికి గురయ్యారు. పక్కనే ఉన్న చిరంజీవిని చూసి మీరు కూడా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థే కదా అని అడిగారు. ఆ పాత్రలో మీరు చేస్తారా? అని అడిగారు. దీంతో చిరంజీవి.. సుధాకర్ వైపు ప్రశ్నార్థకంగా చూశారు. సుధాకర్ ఒప్పుకోమని సైగ చేయడంతో చిరంజీవి అంగీకరించారు. అలా చిరంజీవికి తొలి సినిమా అవకాశం దక్కింది. అయితే, ‘పునాది రాళ్లు’ కంటే ముందే ఆయన నటించిన రెండో చిత్రం ‘ప్రాణం ఖరీదు’ ముందుగా రిలీజ్ అయ్యింది. ఈ విషయాలను చెన్నైలోని ‘విజయచిత్ర’ సినిమా పత్రికలో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Also Read: టాలీవుడ్‌లో ‘మెగా’ సందడి.. వరుస చిత్రాలతో చిరు ప్రభంజనం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
'శంకర్ దాదా జిందాబాద్' సినిమా తర్వాత బ్రేక్ తీసుకుని రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన చరంజీవి మళ్లీ ‘ఖైదీ నెం.150’లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2021-2022లో వరుస చిత్రాలతో సందడి చేయనున్నారు. చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సందడి చేయనుంది. 153వ చిత్రం ‘గాడ్‌ఫాదర్’, ‘భోళాశంకర్’తోపాటు మరో రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.